కృష్ణ

రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, మే 25: రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సబ్సిడీ విత్తనాలను రైతులకు అందజేశారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో మిర్చి కొనుగోళ్లను పరిశీలించారు. యార్డ్‌లో మిర్చి కొనుగోళ్లను ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత మిర్చి రైతులు పంట అమ్ముకునేందుకు వ్యయ ప్రయాసలకోర్చి గుంటూరు యార్డ్‌కు వెళ్లే బాధలు తప్పాయన్నారు. గురువారం 94 మంది రైతులకు చెందిన 3358 క్వింటాళ్ల మిర్చిని బయ్యర్ (ట్రేడర్)లు కొనుగోలు చేశారు. అత్యధిక ధర క్వింటాల్‌కు రూ.5600లు, అత్యల్పం రూ.1350, సరాసరి (యావరేజ్) రూ.3400లు లభించినట్లు యార్డ్ కార్యదర్శి గోవిందు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మండల, పట్టణ తెదేపా అధ్యక్షులు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, కొండూరు వెంకట్రావు, మార్కెట్ కమిటీ పిఐసి దాసు తదితరులు పాల్గొన్నారు.