తెలంగాణ

వంద రోజుల పని కల్పించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 27: మాకు పనులు కల్పించడం లేదు.. పని చేసినా కూలీ గిట్టుబాటు కావడం లేదు...కూలీ చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుదంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుట ఉపాధి కూలీలు మొరపెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరంలో ఉపాధి పనులతోపాటు పలు అభివృద్ధి పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధి కూలీలతో మాట్లాడగా కూలీలు పైవిధంగా గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి కృష్ణారావు ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేశంలను వెంటనే సస్పెండ్ చేయాలని, కోహెడ ఎంపిడిఓ శ్రీనివాస్‌ను బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కృష్ణారావు మాట్లాడుతూ ప్రతీ పేద కుటుంబానికి ఏడాదిలో వంద రోజులు పనులు కల్పించాలని, రోజుకు 194 రూపాయల కూలీ పడేలా పనులు చేయించాలని ఆదేశించారు. వంద రోజుల పనులు కల్పించిన గ్రామాలకు సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఉపాధిహామీలో 152 రకాల పనులు కల్పించవచ్చునని, పనులు అడిగిన ప్రతీ ఒక్కరికి పనులు కల్పించాలని ఆదేశించారు. గ్రామాలలో కూలీలకు ఉపాధి పనులు కల్పించకున్నా, కూలీ గిట్టకున్నా, బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరిగినా వెంటనే టోల్ ఫ్రీ నం.18002001001కు ఫోన్ చేయాలని మంత్రి స్వయంగా కూలీలకు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో, బాధ్యతగా కూలీలకు పనులు కల్పించాలని, వారికి వంద రోజుల పనులు కల్పిస్తే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జూపల్లి అన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఖర్చు చేస్తున్నా, కరువు పరిస్థితుల వలన ప్రజలు సంతోషంగా లేరన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి ప్రజల చెమటతో వచ్చిన సొమ్మేనని, పేద ప్రజల అభివృద్ధికే ఖర్చు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మానకొండూర్, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితెల సతీష్‌కుమార్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.