శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వివాహిత హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 1: వివాహిత అథృశ్యమైనట్లు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆమె భర్తే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ధర్మవరానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి నతానియన్ కుమార్తె వినీత చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన సుధీర్‌కుమార్‌బాబుతో నాలుగేళ్ల కిందట తిరుమలలో పరిచయమైంది. పరిచయం అయిన ఆరు రోజులకే వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఇరు కుటుంబాల్లో ఇష్టం లేకపోవడంతో వీరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. సుధీర్‌కుమార్‌బాబు నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో హౌస్‌సర్జన్‌గా పని చేస్తున్నాడు. స్థానిక అరవిందనగర్‌లో గత ఏడు నెలలుగా వీరు అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నారు. పెళ్లి అయిన నాటి నుండి సుధీర్‌కుమార్‌కు తన భార్య వినీత ప్రవర్తన నచ్చేది కాదు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. ఈక్రమంలో గత నెల 29వ తేదీ అర్ధరాత్రి మరోసారి భార్యాభర్తల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో వినీత సుధీర్‌కుమార్‌పై చేయి చేసుకుంది. కోపోద్రిక్తుడైన సుధీర్‌కుమార్ ఆమె గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. వెంటనే ఈ విషయాన్ని వినీత తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే వినీత తండ్రి నెల్లూరు పోలీసులకు సమాచారం అందివ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. ఈలోగానే భార్య శవాన్ని రెండు ముక్కలుగా కోసి రెండు సూట్‌కేసుల్లో సర్ది ఆ సూట్‌కేసులను తీసుకొని సుధీర్‌కుమార్ తిరుపతికి బయలుదేరాడు. గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతికి చేరుకున్న సుధీర్ అక్కడ నుంచి మరో వాహనంలో భాక్రాపేట అటవీ ప్రాంతంలోని ఓ లోయ వద్దకు చేరుకొని వినీత మృతదేహ భాగాలను లోయలో పడేశాడు. అప్పటికే దర్యాప్తు చేపట్టిన నాలుగో నగర సిఐ సీతారామయ్య చుట్టుపక్కల విచారించి హత్య జరిగి ఉంటుందనే అనుమానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. భాక్రాపేట సమీపంలో వినీత మృతదేహాన్ని పడేశాడన్న పక్కా సమాచారంతో మృతదేహం పడి ఉన్న ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. వినీత భర్త డాక్టర్ సుధీర్‌కుమార్‌బాబు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.