రాష్ట్రీయం

స్టార్ట్ అప్‌లకు విస్తృత అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో అనువైన వాతావరణం: ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణలో స్టార్ట్ అప్‌లకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ఇన్ఫోసిస్ బోర్డు డైరెక్టర్, విద్యా రంగం, మానవ వనరుల అభివృద్ధి రంగంలో నిపుణులైన మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న మోహన్‌దాస్ పాయ్ తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌తో శనివారం సమావేశం అయ్యారు. గచ్చిబౌలిలోని టి-హబ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ఐటి పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. తెలంగాణలో స్టార్ట్ అప్‌ల అభివృద్ధికి అనువైన వాతావరణం ఉందని, అయితే దేశంలోనే అత్యున్నత కేంద్రంగా మార్చేందుకు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. టి-హబ్‌లోని సౌకర్యాలు, టి- హబ్ లక్ష్యాలను తెలుసుకున్న మోహన్‌దాస్ పాయ్ తెలంగాణ ప్రభుత్వ విజన్‌ను కొనియాడారు.
సాంకేతిక రంగంలో పరిశోధనలు పెంచేందుకు ప్రభుత్వం- ప్రైవేటు సంస్థలు పాఠశాల స్థాయిలోనే ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టాలని మోహన్‌దాస్ సూచించారు. దేశంలో మంచి ఆలోచనలకు పెట్టుబడి పెట్టేందుకు వచ్చే సంస్థలు, వ్యక్తులకు కొరత లేదని అన్నారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా ఆస్పిరేషన్ ఫండ్ సైతం నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ తరానికి యువకులే హీరోలు కావాలని, వారి విజయగాథలు పలువురికి స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. యువకులకు సహకారం అందిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని, వారికి ప్రోత్సాహం అందించే దిశగా టి-హబ్ ఏర్పాటు చేయడం గొప్ప ముందడుగు అని అన్నారు. గత పదహారు నెలల్లో రాష్ట్రంలో ఐటి పరిశ్రమ అభివృద్ధికి వినూత్న ప్రయోగాలు చేస్తున్నామని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. పరిశోధనల కోసం టి- హబ్ చేశామని, నల్సార్ విశ్వవిద్యాలయం, ట్రిపుల్ ఐటి వంటి అత్యున్నత సంస్థలు, వ్యక్తుల భాగస్వామ్యంతో ముందుకు వెళుతున్నట్టు చెప్పారు. ఇక యువకులు, విద్యార్థులను దిశా నిర్దేశం చేసే ఉద్యోగులుగా మార్చేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ( టాస్క్)ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీటితో పాటు గేమ్ పార్క్, డాటా అనాలిటిక్స్ పార్క్‌ల రూపకల్పనకు చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మోహన్‌దాస్ పాయ్ చేసిన సూచనలు అన్నింటినీ తప్పకుండా తెలంగాణ ఐటి పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగించుకుంటామని కెటిఆర్ తెలిపారు. సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు టి-హబ్ సిఇఓ జె కృష్ణన్ పాల్గొన్నారు.