రాష్ట్రీయం

కొండెక్కనున్న మామిడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 15: ప్రకృతి అనూకూలించక పోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయి ఈ ఏడాది మామిడి ధర కొండెక్కనుంది. తోటల వద్దే కాయ 10 రూపాయల ధర పలుకుతోంది. పూత, పిందె దశలో భారీగా నష్టపోవడంతో మిగిలిన పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 3.7 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో మామిడి పూత బాగా వచ్చింది. దీంతో మంచి దిగుబడి రావచ్చని రైతులు ఆశపడ్డారు. అయితే తేనెమంచు కారణంగా చాలావరకూ పూత రాలిపోయింది. పిందె దశలో తామర తెగులు ఆశించడంతో పిందెలు కూడా భారీగా రాలిపోయాయి. దీంతో ఈ ఏడాది మామిడి దిగుబడి బాగుంటుందనుకున్న రైతుల ఆశలు కాపు ఆరంభంలోనే ఆవిరయ్యాయి. తామర తెగులు నివారణకు శాస్తవ్రేత్తలు సూచించిన మందులు పిచికారీ చేసినా ఆశించిన మేర ఫలితాలివ్వలేదు. తెగులు అదుపులోకి రాలేదు. రైతుల సమస్యపై వ్యవసాయ శాఖ, శాస్తవ్రేత్తలు తగిన రీతిలో స్పందించలేదని రైతులు విమర్శిస్తున్నారు. అదుపులోకి రాని తెగులుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సలహాలిచ్చే నాథుడు లేడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తెగులు వల్ల మామిడి కాయపై మచ్చలు వచ్చి, సరైన ధర పలకదు. సాధారణంగా హెక్టారుకు 12 టన్నుల మేర మామిడి కాయల దిగుబడి ఉంటుంది. కానీ ఈ ఏడాది సాధారణంతో పోలిస్తే 35 నుంచి 40 శాతానికి పడిపోయింది. సగటున హెక్టారుకు మూడు లేక నాలుగు టన్నుల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నూజివీడు, తదితర ప్రాంతాల్లో బంగినపల్లి మామిడి తోటలను దాదాపు 60వేల ఎకరాల్లో నరికేశారు. సరైన నాణ్యత, దిగుబడి తగ్గడంతో ఈ తోటలను నరికి వేసినట్లు రైతులు చెబుతున్నారు. దీనికితోడు నీటి లభ్యత కూడా సరిగా లేకపోవడం మామిడి దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దిగుబడి తక్కువగా ఉండటంతో తోటల వద్దే మామిడి కాయ ధర 10 రూపాయలు పలుకుతోంది. పురుగు మందులు, మామిడి కాయ కోత, రవాణా ఖర్చులు భారీగా ఉండటం, దిగుబడి తగ్గడంతో మామిడి రేటు ఈసారి గత ఏడాది కంటే ఎక్కువ ధర పలకనుంది.
గత ఏడాదితో పోలిస్తే దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ, ఉన్న కాయలు నాణ్యత బాగుండటంతో మంచి ధర పలుకుతుందని మామిడి రైతులు అంటున్నారు. అయితే దళారులు, వ్యాపారుల మాయాజాలం కారణంగా ఇక్కడ కూడా మామిడి రైతు నష్టపోతున్నాడు. ఈ ఏడాది మామిడి ధర గరిష్టంగా టన్నుకు 60 వేల నుంచి లక్ష రూపాయలకు చేరుకోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు సహా విదేశాలకు ఎగుమతులు ఎక్కువ అవుతుండటంతో మామిడికి బాగా గిరాకీ పెరిగింది. సీజన్ ప్రారంభంలో తోతాపురి రకం మామిడి టన్ను 50 వేల రూపాయల ధర పలికింది. తరువాత ఒక్కసారిగా 14 వేల రూపాయలకు పడిపోయింది. మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు చక్రం తిప్పుతుండటంతో ఒక్కసారిగా ధర పడిపోయిందని తెలుస్తోంది. బంగినపల్లి తోటలు భారీగా నరికివేయడంతో ఈ ఏడాది టన్ను ధర లక్ష రూపాయలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. చెరకు రసాలు, తోతాపురి రకాల ధర 45 నుంచి 60 వేల రూపాయలకు చేరుతుందంటున్నారు. తోట నుంచి మార్కెట్‌కు వచ్చేసరికి ధరలో తేడా భారీగా ఉంటోంది.