రాష్ట్రీయం

పార్టీలతో కాదు ప్రజలతోనే మా పొత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్టీలతో కాదు ప్రజలతోనే తమ పార్టీ పొత్తు పెట్టుకుటుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ అన్నారు. సోమవారం మహాసభల సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు చేరువ అవుతున్నట్టు చెప్పారు. బీజేపీ పాలనలోదేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ వివక్ష కొనసాగుతుందని, రోహిత్ వేముల ఆత్మహత్య, అనంతరం జరిగిన పరిమాలు చాలా బాధకరమని అన్నారు. ఇటీవల ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన కలిచివేసే సంఘటన అని అన్నారు. ఆ కేసును సైతం అక్కడి ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేసిందని అన్నారు. రాబో యే రోజుల్లో దేశ రాజకీయాల్లో ప్రభావితం చేసే విధంగా పార్టీ మహాసభలను జరగనున్నాయని తమ్మినేని అన్నారు. సామాజిక న్యాయం, మతోన్మాదం, ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు- వాటి పరిష్కార మార్గాలు, భవిష్యత్ ఉద్యమాల నిర్మాణం తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించి తీర్మాణాలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ధర్డ్‌ఫ్రంట్‌లో ఎట్టి పరిస్థితిలో చేరేది లేదని స్పష్టం చేశారు. అవకాశ వాద రాజకీయాల కోసం చేసే ప్రయత్నాలను తమ మద్దతు ఉండదని పేర్కొన్నారు. సీపీ ఎం చరిత్రలో ఇలాంటి ఫ్రంట్‌లను ఎన్నో చూశామన్నారు. అనంతరం మహాసభల కోసం మురిసెలే... అరుణ కిరణం పేరుతో రూపొందించిన వీడియో పాటను ఆవిష్కరించారు.