తెలంగాణ

అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాదీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి ఒకరు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన మాథ్యూస్ అమెరికాలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. కాగా ఆదివారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మాథ్యూస్ మృతి చెందాడు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విద్యార్థి మరణ వార్తను అతడి తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో తార్నాకలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో
తొలి పిడియాక్ట్ నమోదు

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు: సిపి సుధీర్‌బాబు

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, ఫిబ్రవరి 21: వరంగల్ పోలీసు కమిషనరేట్ ఏర్పాటైన తర్వాత తొలిసారి పిడియాక్ట్ అమలు చేస్తూ పోలీసు కమిషనర్ జి. సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించిన వారిపై పిడియాక్ట్ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గతంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో 84 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి వరంగల్ కమిషరేట్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు బానోతు రవిపై అండర్ సబ్ సెక్షన్ (3) ప్రకారం పిడియాక్ట్ అమలు చేస్తూ ఆయన తొలి జీవో నెంబర్ 419 ఉత్తర్వులను జారీ చేశారు. పోలీసు కమిషనరేట్ ఏర్పాటు అనంతరం పోలీసు కమిషనర్‌కు సంక్రమించిన ప్రత్యేక మెజిస్టీరియల్ అధికారంతో పిడియాక్ట్‌ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. నిందితుడు బానోతు రవిపై పిడియాక్ట్ ఉత్తర్వులు జారీ కావడంతో ఇకపై అతనికి కోర్టు ద్వారా ఎలాంటి బెయిల్ మంజూరు చేయకపోవడంతో పాటు ఒక సంవత్సర కాలం జైలు జీవితం గడపాల్సి ఉంటుందన్నారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసే, మహిళలపై దాడులు, భూకబ్జాలకు పాల్పడే వారిపై ఈ పిడియాక్ట్ అమలు చేస్తామన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే నిందితుల కదలికలపై సంబంధించిన సమాచారం సేకరించడంతో పాటు నేరాలకు పాల్పడిన నిందితుల చరిత్రపై ఎసిపి, ఇన్స్‌పెక్టర్ల నుంచి సేకరించిన పూర్తి సమాచారం ఆధారంగా నిందితులపై పిడి యాక్ట్ అమలు చేస్తామన్నారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై పిడియాక్ట్ అమలు చేస్తామని కమిషనర్ సుధీర్‌బాబు హెచ్చరించారు.