రాష్ట్రీయం

మతోన్మాదం పెచ్చుమీరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: ‘ఆరెస్సెస్ చేతుల్లో కేంద్రం కీలుబొమ్మ’గా ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. దేశంలో మతోన్మాదం పెచ్చుమీరిందని, కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విభజించు- పాలించు విధానాన్ని అమలు చేస్తోందని విరుచుకుపడ్డారు. సీపీఎం జాతీయ మహాసభలు బుధవారం నగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సీతారాం ఏచూరి ప్రారంభోపన్యాసం చేస్తూ గోరక్ష పేరిట మైనారిటీలు, దళితులపై దాడులు పెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో మైనారిటీ, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆరెస్సెస్, భజరంగ్‌దళ్ వంటి హిందుత్వ శక్తులు పాలనను ప్రభావితం చేస్తుండటంతో అన్యాయాలు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. నానాటికీ వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడుతుందని, యువతకు ఉపాధిలేక అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష కోట్లను కార్పొరేట్ శక్తులకు కేంద్రం దోచిపెట్టిందని దుయ్యబట్టారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడే శక్తి వామపక్షాలకే ఉందని వివరించారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని రక్షించుకునేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్రశక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీపీఎం 22వ మహాసభలు భవిష్యత్ ఉద్యమాలకు దిశానిర్ధేశం చేయనున్నాయని అన్నారు. సామాజిక న్యాయం, మతతత్వ బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా మహాసభల్లో చర్చలు నిర్వహించి తీర్మానాలను ఆమోదిస్తామన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో కార్పొరేట్ శక్తుల ఆదాయం భారీగా పెరిగిందన్నారు. మతం పేరిట మారణహోమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వారి మతోన్మాదాన్ని ప్రశ్నించినందుకు మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులను హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరెస్సెస్, బీజేపీ పార్టీలు రాజ్‌భవన్‌లను అధికారిక కేంద్రాలుగా వాడుకుంటూ పాలనలో హిందుత్వాన్ని జొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితిలో వామపక్షాల మధ్య ఐక్యత ఎంతో అవసరమన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల అనంతరం ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా హక్కులు కాలరాయబడుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం రాష్ట్ర అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో 4200 కిలోమీటర్లు మహాజన పాదయాత్ర నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.