రాష్ట్రీయం

కాకర్ల అక్రమాస్తులు..రూ. 30 కోట్లపైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, విశాఖపట్నం, ఏప్రిల్ 18: విజయనగరం జేసీ-2గా పనిచేస్తున్న కాకర్ల నాగేశ్వరరావు, ఆయన బంధువుల ఇళ్లపై బుధవారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో సుమారు రూ.30 కోట్ల విలువైన ఆస్తులు, బంగారం లభ్యమయ్యాయి. ఏసీబీ అధికారులు మాత్రం డాక్యుమెంట్ల విలువ రూ.5 కోట్లుగా చెబుతున్నారు. మార్కెట్ విలువ దీనికి ఆరింతలు ఎక్కువ ఉన్న మాట వాస్తవం. బుధవారం ఉదయం ఎసీబీ డిఎస్పీ షకీలాబాను ఆధ్వర్యంలో విజయనగరంలో దాడులు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో విశాఖపట్నంలోని అతని తల్లి నివాసం ఉంటున్న ప్రాంతంలోను, కర్ణాటకలోని అల్లుడు రామకృష్ణ ఉంటున్న ఇంటిపై కూడా ఏసీబీ బృందాలు 12 చోట్ల సోదా లు జరిపారు. విశాఖ డీఆర్వోగా, అన్నవరం ఈవోగా పనిచేసిన కాలంలో ఈయన అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విషయం విదితమే. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో 705 గ్రాముల బంగారం, వెండి 5567.50 గ్రాములు, బ్యాంకులో నిల్వ రూ.19.91 లక్షలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.12.75 లక్షలు, గృహోపకరణాలు కలిపి రూ.10.72 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. వాటితోపాటు విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో 774.5 చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలం, తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో 484 చదరపు అడుగుల స్ధలంతోపాటు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తామరాపల్లిలో వేర్వేరు సర్వే నంబర్లతో 133.32 సెంట్ల వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇది గాకుండా జేసీ కుమారుడు రాజేష్ చంద్ర పేరిట అమలాపురంలో 14 సెంట్ల ఖాళీ ఇంటి స్థలం, విశాఖలోని రేసపువానిపాలెంలో ఒక ఫ్లాట్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే జేసీ-2 తల్లి కాకర్ల ధనలక్ష్మి పేరిట కాకినాడ పట్టణంలోని సూర్యారావుపేటలో 1250 చదరపు అడుగుల స్థలం, విశాఖలోని ఎండాడలో 633 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉన్నట్టు గుర్తించారు. వీటితోపాటు అతని కుమార్తె కాకర్ల నీహారిక పేరిట విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండతామరాపల్లిలో ఒక ఎకరా స్థలం, విశాఖలోని మధురవాడలో 389 చదరపు అడుగుల స్థలం, మరో 231 చదరపు అడుగుల స్థలం, అమలాపురంలో 484 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల స్థలం ఉన్నాయి. వీటితోపాటు బినామీ ఆస్తుల పేరిట విశాఖలోని పెదవాల్తేరులో రామకృష్ణరాజు పేరిట ఒక ప్లాట్, రమణమూర్తి రాజు పేరిట ఒక ఫ్లాట్ ఉన్నట్టు గుర్తించారు.
ఇదీ జేసీ-2 ప్రస్థానం
పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన కాకర్ల నాగేశ్వరరావు 1990లో డిప్యూటీ తహశీల్దార్‌గా తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలంలో తన తొలి సర్వీసును ప్రారంభించారు. 1998లో తహశీల్దార్‌గాను, 2003లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. తహశీల్దార్‌గా మారేడుబిల్లి, పెద్దాపురం, ఐ పోలవరం, ముమ్మడివరం కాకినాడ ప్రాంతాల్లో పనిచేశారు. డిఆర్వో స్థాయిలో విశాఖపట్నం, హెచ్‌పిసిఎల్, నర్సీపట్నం ప్రాంతాల్లో పనిచేశారు. సింహాచలం దేవస్థానం ఈవోగాను, కాకినాడ ఆర్డీవోగాను, హెచ్‌పిడిసిఎల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ఆర్డీవోగా జంగారెడ్డిగూడెం, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఏలూరు, అదనపు జాయింట్ కలెక్టర్‌గా గుంటూరు, అన్నవరం దేవస్థానం ఈవోగా పనిచేశారు. గత ఏడాది జూన్ నుంచి ఇక్కడ అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా, జేసీ-2ని అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించినట్టు డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ పేర్కొన్నారు.