రాష్ట్రీయం

ధర్మదీక్ష కాదు.. ఎన్నికల దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణదుర్గం, ఏప్రిల్ 18: తెలుగుదేశం పార్టీ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. సీఎం చేసేది ధర్మదీక్ష కాదు 2019 ఎన్నికల దీక్ష అని ఆయన ఎద్దేవాచేశారు. బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన బీజేపీ, టీడీపీలపై విరుచుకుపడ్డారు. సీఎం చేసే దీక్ష ప్రత్యేక హోదా కోసం కాదని, అది ఎన్నికల దీక్ష అంటే బాగుంటుందని అన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో రాసుకుని, పూసుకుని తిరిగి నేడు విడాకులు తీసుకున్నట్లు వ్యవహిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యకాదని చెప్పినా, సాధిస్తామని చెబుతుంటే ఎలా నమ్మేదన్నారు. 2014 ఎన్నికల్లో సమైక్యాంధ్ర పేరుతో ప్రజలను మోసం చేశారని, నేడు ప్రత్యేక హోదాతో మోసం చేయడానికి సిద్ధపడ్డారని విమర్శించారు. హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని ఆ రోజు పార్లమెంటులో పట్టుపట్టిన బీజేపీ నేడు ఇవ్వడానికి సాధ్యం కాదు అంటోందన్నారు. దేశంలో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీతో పాటు, వారి మిత్రపక్షాలకు వణుకు పుడుతోందన్నారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ ప్రధానమంత్రి కావడం తథ్యమని అన్నారు. అప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడమేగాక ఆ ఫైలుపైనే తొలి సంతకం చేస్తారన్నారు. 2019 ఎన్నికల్లో తాము ఎవరితో జతకట్టడం లేదని, 175 స్థానాల్లో పోటీ చేస్తామని రఘువీరా చెప్పారు. అధికారం కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తామని, అధికారం తమకు కొత్తకాదని చెప్పారు. ఈ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి జరగలేదని, అవినీతితో పాలన సాగిపోయిందని విమర్శించారు.
జీఎస్‌టీ వల్ల దేశంలోని రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు, తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. మీరు సాధించింది ఏమిటని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని, ప్రత్యేక హోదా తీసుకుని వస్తామని, పరిశ్రమలు ఎర్పాటు చేసి, రాయితీలు కల్పిస్తామని, నిరుదోగ్య సమస్య తీరుస్తామని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశం తీవ్రంగా నష్టపోవడంతో పాటు, ధనవంతులు బాగుపడ్డారని విమర్శించారు. నేడు బ్యాంకుల్లో డబ్బు లేదు, ఏటీఎంలలో డబ్బు లేదు, ఉన్న డబ్బు మొత్తం అధికార పార్టీ నేతల వద్దే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేయడానికి దేశంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని రఘువీరా విమర్శించారు. నేరం చేస్తున్న వారు అధిక శాతం బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులేనని ఆరోపించారు. ఆసిఫా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కర్నాటకలో జరిగే ఎన్నికల్లో కోటి మంది తెలుగు మాట్లాడే ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు.