రాష్ట్రీయం

టాటూలు, గోరింటాకూ నిషిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 18: కఠిన నిబంధనల మధ్య ఏపీ ఎంసెట్-2018 నిర్వహించడానికి కాకినాడ జేఎన్‌టీయూ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఎంసెట్ నిర్వహణలో ఏ విధమైన విమర్శలకు తావులేకుండా, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎంసెట్ నిర్వహణలో వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మెహందీ, గోరింటాకు వంటివి పెట్టుకుంటే అనుమతించేది లేదని, టాటూలు వేసుకోరాదని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు స్పష్టం
చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను నిశితంగా గమనిస్తామని, నిబంధనల్లో ఏ ఒక్కటి పాటించకున్నా పరీక్షకు అనుమతించేదిలేదన్నారు. పరీక్షకు ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఇప్పటికే ప్రకటించామన్నారు. పరీక్షా సమయానికి గంట ముందుగా హాజరుకావాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఏ విధమైన స్మార్ట్‌వాచీలను అనుమతించబోమని చెప్పారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతీ విద్యార్థికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమని స్పష్టంచేశారు. ప్రతి విద్యార్థికి పరీక్ష రాయడానికి కంప్యూటర్ కేటాయిస్తామని, పరీక్ష రాసే అభ్యర్థి ఆన్‌లైన్ విధానంలో తన జవాబును ఎన్ని సార్లైనా మార్చుకునే అవకాశం ఉందన్నారు.
ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లు జారీచేస్తున్నామని డాక్టర్ సాయిబాబు చెప్పారు. రూ.5000 ఆలస్య రుసుంతో గురువారం వరకు దరఖాస్తులు దాఖలు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈనెల 20, 21 తేదీల్లో రూ.10వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తామని, 22వ తేదీ పరీక్షా సమయంలోగా హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకుని, ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈనెల 25వ తేదీన అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశపరీక్షను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని డాక్టర్ సాయిబాబు వివరించారు.