ఆంధ్రప్రదేశ్‌

విభజన లోపాల వల్లే ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: విభజన సమయంలో లోపాల వల్లే ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని, కేక్ కట్ చేసినట్లు ముందు చూపు లేకుండా రాష్ట్రాన్ని విభజించడం వల్లే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక, రాజకీయ ఇబ్బందులు పడుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోకగజపతిరాజు పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం రణస్థలం మండలం అల్లివలస, కొండములగాం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. విశాఖకు రైల్వేజోన్ ఏర్పాటుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తాము కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాలోచన చేస్తున్నాయన్నారు. అతిత్వరలో విశాఖ రైల్వే జోన్ పట్ల ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నారు. విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం ఇటువంటి అత్యవసరమైన నిర్ణయాలను ప్రస్తావించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలు అడ్డుచెప్పడం వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అభివృద్ది జరుగుతుందన్నారు. గతంలో రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసినప్పుడు దేశవ్యాప్తంగా లాఠీచార్జీలు జరిగేవని, ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం అటువంటి పరిస్థితి లేదన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో గత ప్రభుత్వాలకంటే ప్రస్తుత ప్రభుత్వం ఎంతో బాగా పనిచేస్తోందన్నారు. తుపాన్ల నుంచి ప్రజలను కాపాడేందుకు రక్షిత భవనాలు నిర్మించేందుకు వేల కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేస్తోందన్నారు. కొవ్వాడ అణుపార్కు ఏర్పాటుకు ముందే అక్కడ మత్స్యకార నిర్వాసితులకు కావల్సిన వౌలిక సదుపాయాలతోపాటు, వారికి పునరావాసం కల్పించిన తర్వాతే అణుపార్కు ఏర్పాట్లు జోరందుకుంటుందన్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ 13 నెలల్లో తోటపల్లి కాల్వ పనులు పూర్తి చేసి సాగునీరందించామన్నారు.