రాష్ట్రీయం

చంద్రబాబూ.. మిమ్మల్ని ఎలా నమ్మాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మాపోరాట దీక్ష పేరిట చేస్తున్న నిరాహార దీక్షను ఎలా నమ్మాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రశ్నించారు. అసలు రాష్ట్రానికి మేలు జరగాలని తాము ఏమీ ఆశించకుండానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కృషి చేశామని, కానీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వారి అబ్బాయి, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేతులను వెనుక నుంచి మీడియా శక్తుల ద్వారా చంపేస్తున్నారని వారిని ఎలా నమ్మాలని పవన్‌కళ్యాణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ దీక్షను నిర్వహించారు. అయితే ఈ దీక్షలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబునాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు ఆహ్వానం పంపించారు. ఈ విషయాన్ని పవన్ తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. అందులోనే నేరుగా చంద్రబాబునాయుడును ఉద్ధేశించి పవన్ కామెంట్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ కిమిడి కళావెంకరావు తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని, అందుకు తాను ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
భావోద్వేగ ట్వీట్లు
సినీ ఇండస్ట్రీలో, ఏపీలోని రాజకీయ పరిణామాలపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ గురువారం రాత్రి వరుసగా ట్వీట్లు చేశారు. ఈ సం దర్భంగా ఆయన ఒక ట్వీట్ చేస్తూ ‘నా ప్రియమైన అభిమానులకు, అక్క చెల్లెళ్లకు, ఆడపడుచులకూ , జనసైనికులకు నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు, ఈ రోజు నుండి ఏ క్షణం అయినా నేను చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను. ఒక వేళ నేను ఈ పోరాటంలో చనిపోతే, మీరు గుర్తించుకోవల్సింది నేను ఎంతో కొంత నిస్సహాయులకు అండగా అధికారం అనేది అండదండలు ఉన్న వారికే పనిచేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగ బద్ధమైన విధానాలకు లోబడి పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు’ అని పవన్ పేర్కొన్నారు.