రాష్ట్రీయం

ఫిలిం చాంబర్ వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: నగరంలోని ఫిలిం చాంబర్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. హీరో, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తల్లిపై నటి శ్రీరెడ్డితో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేయించినందుకు పవన్‌కళ్యాణ్, మెగాస్టార్ కుటుం బం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై చిత్ర రంగ పెద్దలతో మాట్లాడేందుకు శుక్రవారం పవన్ కళ్యాణ్ ఫిలిం చాంబర్ వద్దకు చేరుకున్నారు. పవన్‌తో పాటు నాగబాబు, మరికొంతమంది ఆయనకు మద్దతు పలికే వా రు చాంబర్‌కు చేరుకోవడం, అక్కడే పవన్‌కళ్యాణ్ దాదాపు 3 గం టల పాటు ఉండడంతో పవన్, మెగా అభిమానులు భారీగా తరలి వచ్చా రు. వారిని చాంబర్ వద్ద లోనికి రాకుండా నియంత్రించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని భావించిన పోలీసులు పవన్‌కళ్యాణ్‌కు సమాచారం అందించారు. దీంతో పవన్ కళ్యాణ్ చాంబర్ నుంచి వెళ్లిపోయారు. బయటకు వచ్చి మాట్లాడతారని భా వించిన అభిమానులు నిరాశ చెందారు. పవన్‌కళ్యా ణ్ తల్లిపై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను పదే పదే ఎబిఎన్ న్యూస్ చానల్‌లో ప్రచారం చేశారని ఆగ్రహంతో ఉన్న పవన్ అభిమానులు చాంబర్ వ ద్ద కవరేజ్‌కు వచ్చిన ఆ మీడియా సంస్థ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వాహ నం పాక్షికంగా ధ్వంసం కావడం తో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించి వాహనం ధ్వంసం చేసి న వారిని గుర్తించే పనిలో పోలీసుల ఉన్నారు. కాగా వర్మపై న్యాయపోరాటం చేసేందుకు గాను పవన్ కొందరు న్యాయవాదులతో చాంబర్‌లో చర్చించిన ట్లు సమాచారం. పోలీసుల విజ్ఞప్తి మేరకు పవన్ కళ్యాణ్ వెళ్లిపోవడంతో ఆ తర్వాత అభిమానులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

చిత్రాలు....సోదరుడు నాగబాబుతో కలిసి ఫిలిం చాంబర్‌కు వచ్చిన జనసేనాని పవన్‌కళ్యాణ్
*ఫిలిం చాంబర్ వద్దకు పెద్దఎత్తున తరలివచ్చిన పవన్‌కళ్యాణ్ అభిమానులు