తెలంగాణ

రాష్ట్భ్రావృద్ధికి సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: తెలంగాణలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని, అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలో దాదాపు రూ.2.50 కోట్లతో నిర్మించిన పలు ప్రభుత్వ కార్యాలయాల నూతన భవనాల ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడుతూ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటే అందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ సహకారం అందిస్తారని అన్నారు. దేశంలో 2020 వరకు అన్ని గ్రామాలకు బిటి రోడ్డు సౌకర్యం కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వెల్లడించారు. దేశంలో చిరువ్యాపారులకు చేయూతను కల్పించేందుకు రూ.5 లక్షల నుండి 10 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యాందన్నారు. ముద్ర బ్యాంకు ద్వారా రూ.82 వేల కోట్ల రుణాలు మహిళలకు అందించాలనే లక్ష్యంతో ముద్ర బ్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఫార్మా సిటీలు ఏర్పాటు అవుతున్నాయని తెలంగాణలో కూడా ఫార్మాసిటీ నిర్మాణం అవుతుందని, అందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు కూడా ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించేందుకు యోచిస్తున్నామని ధరలకు అనుగుణంగా అన్నివర్గాల కార్మికులకు వేతనాలు పెంచేవిధంగా చర్యలు తీసుకోబోతున్నామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిహిళా సంఘాలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు.