రాష్ట్రీయం

టీటీడీపై ముసురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకంపై విమర్శల వెల్లువ సద్దుమణగకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత తాను క్రిస్టియన్ అంటూ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు వీడియో ఇప్పుడు వైరల్ అయింది. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఈ వ్యవహారంపై నివేదిక అందచేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా ఎమ్మెల్యే అనితను ప్రభుత్వం శుక్రవారం నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్‌ను అని ఆమె చెప్పడం గమనార్హం. తన బ్యాగ్‌లో, కారులో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని, అది లేకుండా తానెప్పుడూ బయటకు వెళ్లనని ఆ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించడం గమనార్హం. ఈ వీడియోలో తాను
క్రిస్టియన్ అని ఆమె చెబుతుండటంతో, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం నియామకం చేసిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పలువర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇప్పటికే అనిత వీడియోను ప్రభుత్వం పరిశీలించింది. ఈ వ్యవహారంపై నివేదిక అందచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హిందూమత విశ్వాసాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. దీంతో టీటీడీ పాలక మండలి నియామకం వివాదాల్లో చిక్కుకుంది.
పునఃసమీక్షించాలి: బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమితులైన విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు వంగలపూడి అనిత తాను క్రిస్టియన్ మతస్థురాలినని ఇప్పటికే స్పష్టంగా తెలియజేశారని, అలాగే టీటీడీ పాలకమండలి అధ్యక్షుడుగా నియమితులైన పుట్టా సుధాకర యాదవ్ క్రిస్టియన్ మతస్థుడని బలమైన వివాదం నెలకొని ఉన్నదని ఈ నేపధ్యంలో వీరి నియామకాలపై పునఃసమీక్ష అవసరమని బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొప్పరపు వెంకట బలరామకృష్ణమూర్తి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. దేవస్థానం పదవులు రాజకీయ పునరావాసం కారాదన్నారు. హిందువుల్లో ఆగమ శాస్త్ర పండితులు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన గొప్పవారు ఉన్నారని అన్నారు. ‘వినాశనకాలే విపరీత బుద్ధి’ అన్నట్లు కాకుండా హిందూ మతస్థులను మాత్రమే పాలకమండలిలో నియమించాలంటూ సంబంధిత శాఖలు ప్రభుత్వానికి సరైన నివేదికలు ఇవ్వాలన్నారు.
చిత్రం..వివాదానికి కేంద్రమైన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత