రాష్ట్రీయం

కాంగ్రెస్‌తో పొత్తుండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ స్పష్టం చేశారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల్ని ఏకం చేసి మళ్లీ బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. స్థానిక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని లౌకిక పార్టీలను కలుపుకుని ముందుకు వెళతామన్నారు. పార్టీ 22వ జాతీయ మహాసభలు ప్రశాంత వాతావరణంలో కొసాగుతున్నాయని బృందాకారత్ తెలిపారు. మహాసభల్లో రాజకీయ తీర్మానంపై వాడీవేడి చర్చలు అని వస్తున్న వార్తలు కేవలం అపోహలని ఆమె అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బృందాకారత్ మాట్లాడారు. సభల్లో భాగంగా పార్టీ నిర్మాణ నివేదికపై శనివారం చర్చ జరిగిందని, ఈ తీర్మానాన్ని రామచంద్రన్ పిళ్లై ప్రవేశపెట్టారని తెలిపారు. విశాఖ మహాసభల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రజా పోరాటాలు, ఉద్యమాలను మహాసభ ముందు
ఉంచినట్టు చెప్పారు. రాజకీయ తీర్మానంపై ప్రతీ సభ్యుడు తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం తమ పార్టీలో ఉన్నందున కొద్దిపాటి ఆలస్యం అయిందని వివరించారు. మతంతో ముడిపడి పాలిస్తున్న బీజేపీని గద్దె దించాలన్న ప్రధాన అజెండాతోనే చర్చలు ప్రారంభం అయ్యాయయని అయితే అందుకు పాటించాల్సిన విధానాల మీద భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఐదు కోట్ల 39వేల సభ్యత్వాలు తమ పార్టీకి ఉన్నాయని, ఇతర పార్టీల్లో లాగా మిస్డ్‌కాల్ సభ్యత్వాలు తమ పార్టీలో ఉండవని చెప్పారు. పార్టీలో 25 వాతం మంది మహిళలు, 25శాతం యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. కధువ ఘటన, మహిళలపై జరుగుతున్న దాడులు, దివ్యాంగుల హక్కులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్టు చెప్పారు.

చిత్రం..హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్