రాష్ట్రీయం

క్రీడాకారులకు కోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వోద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం కె చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో నిర్వహించిన కామనె్వల్త్ గేమ్స్ 2018లో పతకాలు సాధించిన క్రీడాకారులు శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. క్రీడల్లో పతకాలు సాధించి రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింప చేసిన క్రీడాకారులతోపాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌నూ కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. భవిష్యత్‌లో మరింత రాణింపు ప్రదర్శించాలని కోరుతూ, వచ్చే కామనె్వల్త్‌లో తెలంగాణ క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చారని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి రాష్టస్థ్రాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి రాణింపు ప్రదర్శిస్తున్న క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపునిస్తామని, వారిని అన్నివిధాలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా పెండింగ్‌లోవున్న రెండు శాతం రిజర్వేషన్‌ను ప్రభుత్వోద్యోగాల్లో అమలు చేస్తామని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. కామనె్వల్త్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఈనెల 23న లాల్‌బహదూర్ స్టేడియంలో సన్మానించి, అభినందన సభ నిర్వహించనున్నట్టు కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. శనివారం సీఎంను కలిసిన వారిలో బాడ్మింటన్
స్వర్ణ పతక విజేత సైనానెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, పుల్లెల గోపిచంద్‌తోపాటు పలువురు క్రీడాకారులు, కోచ్‌లు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీ కవిత, రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ దినకర్‌బాబుతోపాటు వివిధ క్రీడలకు సంబంధించిన కోచ్‌లు పాల్గొన్నారు. కామనె్వల్త్ క్రీడలను తిలకించేందుకు గోల్డ్‌కోస్ట్ వెళ్లిన శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కామనె్వల్త్ క్రీడల నిర్వహణ తదితర అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు.
క్రీడా సంఘాల హర్షం
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు రూపొందిస్తున్నారని, ప్రభుత్వోద్యోగాల్లో క్రీడాకారులకు రెండు శాతం కోటా ప్రకటించడంపట్ల రాష్ట్రంలోని వివిధ క్రీడా సంఘాలు వేర్వేరు ప్రకనల్లో హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గత కొనే్నళ్లుగా పెండింగ్‌లోవున్న కోటా అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం క్రీడాకారులకు వరంలాంటిదని వ్యాఖ్యానించాయి.
చిత్రం..స్వర్ణ పతకం సాధించిన సైనా నెహ్వాల్‌ను అభినందిస్తున్న సీఎం కేసీఆర్