రాష్ట్రీయం

నేటి నుంచి ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 21: ఏపీ ఎమ్‌సెట్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి కాకినాడ జేఎన్‌టియూ పర్యవేక్షణలో తెలంగాణలోని హైదరాబాద్‌లో 3 రీజనల్ సెంటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 44మొత్తం 47 రీజనల్ సెంటర్ల పరిధిలోని ఆయా పరీక్షా కేంద్రాల్లో 25వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారంగా అభ్యర్ధులు ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ఉదయం 8 గంటలకు కాకినాడ జేఎన్‌టియూలోని సెనేట్ హాలులో ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సెట్ కోడ్ విడుదల చేస్తారు. అనంతరం తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 10 గంటల నుండి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రారంభమవుతుంది.పరీక్షా సమయానికి గంట ముందు అభ్యర్ధులు చేరుకోవాలని, నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఎంసెట్‌కు సుమారు 2 లక్షల 75వేల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో అభ్యర్ధులు ఎంపిక చేసుకున్న 3 రీజనల్ సెంటర్లలో ఒక రీజనల్ సెంటర్ పరిధిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. అతి కొద్ది మంది అభ్యర్థులకు మాత్రమే వారు ఎంపిక చేసుకున్న రీజనల్ సెంటర్ల స్థానే అసౌకర్యం కలుగకుండా దగ్గర్లోని రీజనల్ సెంటర్ల పరిధిలో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను బయోమెట్రిక్ తనిఖీ అనంతరం అనుమతిస్తారు. టాటూలు, గోరింటాకు, మెహందీ వంటివి అలంకరించుకున్నా
అనుమతించరు. కాలుక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ వాచీలు సహా ఏ ఇతర ఇతర వస్తువులను పరీక్షా కేంద్రంలో అనుమతించేది లేదని, విద్యార్థులు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కన్వీనర్ స్పష్టం చేశారు. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష కావడంతో విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను సరిదిద్దుకునే అవకాశం ఉందని, పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. నకిలీ విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం లేకుండా బయోమెట్రిక్ తనికీ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. హాల్‌టిక్కెట్ వెనుక భాగంలో గూగుల్ మ్యాప్ ఇచ్చామని, మ్యాప్‌లో నిర్దేశిత పరీక్షా కేంద్రానికి బస్టాండ్ ఎంత దూరంలో ఉన్నదో వివరించామని, ఆ ప్రకారం విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చేందుకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒకరోజు ముందుగానే నిర్దేశిత పరీక్షా కేంద్రాన్ని సందర్శించాలని కన్వీనర్ డాక్టర్ సాయిబాబు సూచించారు.