రాష్ట్రీయం

బీజేపీ X బాలకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: ఎన్డీఏతో తెగదెంపులనంతరం సీఎం నారా చంద్రబాబునాయుడు, బీజేపీ నేతల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ తాజాగా ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైపు మళ్లింది. ప్రత్యేక హోదాకై విజయవాడలో బాబు చేపట్టిన 12 గంటల ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న బాలకృష్ణ ప్రధాని నరేంద్రమోదీని రాయటానికి వీలులేని పరుష పదజాలంతో దూషించడం పై కమలనాథులు కనె్నర్ర చేస్తున్నారు. విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, రా యలసీమ తదితర ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు బాలకృష్ణ దిష్టిబొమ్మలను తగులబెట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా ప్రధాని మోదీని దుర్భాషలాడినందుకు బాలకృష్ణ, పక్కనే ఉండి ప్రోత్సహించినందుకు చంద్రబాబు ఇరువురిపై పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయితే తక్షణం కేసులు నమోదుకు పోలీసులు వెనుకాడుతున్నారు. విజయవాడలో బీజేపీ కార్యకర్తలు బాలకృష్ణ దిష్టిబొమ్మ తగులబెట్టి సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సినీ రంగానికి చెందిన తోటి స్నేహితుడు బెల్లంకొండ సురేష్‌పైనే కాల్పులు జరిపినప్పుడు బాలకృష్ణను అరెస్ట్ చేసి ఉంటే నేడు ఇంత దుర్మార్గంగా ప్రధానిని నిందించేవారు కాదన్నారు. ఈ దేశ సమైక్యత, అభివృద్ధి కోసం మోదీ రాత్రి, పగలు పాటుబడుతున్నారని అన్నారు. రాజమండ్రిలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ 2004లో అలిపిరిలో జరిగిన సంఘటన ప్రజల్లో సానుభూతి పెంచుతుందని బాబు కలలు కన్నారని, అలాగే ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం తాను చేపట్టిన ఉద్యమం తిరిగి తన పట్ల మరింత సానుభూతి పెంచుతుందని మళ్లీ కలలు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు బాలకృష్ణ ఓ మానసిక రోగి అంటూ ఎద్దేవా చేశారు. తక్ష ణం తన మానసిక స్థితిని వైద్యులచే పరీక్షించుకుంటే మంచిదంటూ సలహానిచ్చారు. అటు బాలకృష్ణ, ఇటు చంద్రబాబులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమం చేపట్టటానికి పార్టీ నేతలు వ్యూహరచన కావిస్తున్నారు.