రాష్ట్రీయం

ఎఎస్ లక్ష్మికి లేడీ లెజెండ్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: స్వావలంబన, స్వయంకృషితో పత్రికా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహిళా జర్నలిస్టు, ఆంధ్రభూమి వార, మాసపత్రికల అసిస్టెంట్ ఎడిటర్ అయ్యగారి సీతా లక్ష్మి ప్రతిష్టాకరమైన లేడీ లెజెండ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 22వ తేదీన (ఆదివారం) ఇక్కడ జరిగే ఒక కార్యక్రమంలో రాజా రతన్ హెల్త్, ఎడ్యుకేషన్ ట్రస్టు, ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ నుంచి ఆమె ఈ అవార్డును స్వీకరించనున్నారు. ఆంధ్రభూమి వార, మాసపత్రికల్లో అసిస్టెంట్ ఎడిటర్‌గా ఎఎస్ లక్ష్మి 19 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 1985లో ఆంధ్రభూమి దినపత్రిక విశాఖపట్నం ఎడిషన్‌లో సబ్‌ఎడిటర్‌గా చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. మహిళలు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె ఎన్నో రచనలు చేశారు. జర్నలిజంలో ఆమె చేసిన కృషికి గతంలో అపురూప అవార్డును, స్ర్తి శక్తి పురస్కారాన్ని అందుకున్నారు.