రాష్ట్రీయం

ఎస్వీబీసీ చైర్మన్‌గా దర్శకుడు రాఘవేంద్రరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 21: ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావును టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ చానల్‌కు చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈవిషయాన్ని శనివారం టీటీడీ పిఆర్వో డాక్టర్ తలారి రవి ఒక ప్రకటనలో తెలియజేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పనిచేసిన రాఘవేంద్రరావుకు ఈసారి పాలక మండలి సభ్యుడిగా స్థానం దక్కకపోయినా, టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ భక్తి చానల్‌కు చైర్మన్‌గా నియమితులైయ్యారు.