రాష్ట్రీయం

కేంద్రంతో రాజీపడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఇక్కడ సమావేశమయ్యారు. విశాఖ పర్యటన ముగించుకుని నేరుగా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ గవర్నర్ తన పర్యటనలో మార్పు చేసుకుని, రైలులో విజయవాడ చేరుకున్నారు. నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో ఆయనకు వసతి కల్పించారు. నగరానికి వచ్చిన గవర్నర్‌ను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై దాదాపు గంటన్నరకు పైగా వారిద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, అమలుకాని విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాలను గవర్నర్ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లినట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించే విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రిని ఇక్కడ సచివాలయంలో కేంద్ర ఇంటిలిజెన్స్ చీఫ్ కలవడం తెలిసిందే. వివిధ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తరువాత గవర్నర్‌తో చర్చించాలని కేంద్రం చేసిన సూచన మేరకే ఆ సమావేళం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శలు చేయటం సరికాదని గవర్నర్ సూచించినట్లు తెలిసింది. తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇద్దరూ చర్చించినట్లు తెలిసింది. సమావేశ
వివరాలు బయటకు వెల్లడించేందుకు అధికార వర్గాలు విముఖత చూపాయి. ఈ భేటీ వివరాల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు విలేఖరులు ప్రయత్నించినప్పటికీ, ఆయన నిరాకరించి వెళ్లిపోయారు. మధ్యాహ్నం రెండు గంటలకు గవర్నర్ నరసింహన్ విజయవాడ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లారు.

చిత్రం..విజయవాడలో ఓ హోటల్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు