రాష్ట్రీయం

మళ్లీ ఏచూరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు రోజులపాటు జరిగిన 22వ సీపీఎం మహాసభలు ఆదివారం ఇక్కడ ముగిశాయి. చివరి రోజు సీపీఎం ప్రతినిధులు 95మందితో కూడిన కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు సీతారాం ఏచూరిని, 17మంది పొలిట్ బ్యూరో సభ్యులను ఎన్నుకున్నారు. ఆదివారం ఇక్కడ ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో
త్రిపుర పూర్వ ముఖ్యమంత్రి, సీపీఎం అగ్రనేత మాణిక్ సర్కార్ వందలాది మంది సీపీఎం ప్రతినిధుల హర్షధ్వనాల మధ్య పార్టీ ప్రధాన కార్యదర్శిగా రెండోసారి సీతారాం ఏచూరి ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడగానే సమావేశంలో ఉన్న సీపీఎం ప్రతినిధులు తమ సీట్లనుంచి లేచి కరతాళ ధ్వనులతో ఏచూరి ఎన్నికను స్వాగతించారు. సీతారాం ఏచూరి
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం ఇది రెండోసారి. 1952 ఆగస్టు 12నన మద్రాసు నగరంలో జన్మించిన ఏచూరి పూర్వీకుల స్వస్థలం ఆంధ్రలోని కాకినాడ. హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో విద్యాభ్యాసం సాగించిన ఏచూరి, 1974లో ఎస్‌ఎఫ్‌ఐలో చేరారు. 1985లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 1992లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. విశాఖపట్నంలో 2015 ఏప్రిల్ 19న జరిగిన 21వ సీపీఎం కాంగ్రెస్ మహాసభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈనెల 18నుంచి 22 వరకు ఇక్కడ జరిగిన 22వ సీపీఎం కాంగ్రెస్ మహాసభల్లో ఏచూరిని మళ్లీ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది.
పొలిట్‌బ్యూరో సభ్యులుగా సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, ఎస్ రామచంద్రన్ పిళ్లై, బీమన్ బసు, మాణిక్ సర్కార్, బృందా కారత్, పినరయి విజయన్, హనన్ ముల్లా, కె బాలకృష్ణన్, ఎంఏ బేబీ, సూర్జ్యకాంత మిశ్రా, మహమ్మద్ సలీం, సుభాషిణి అలీ, బివి రాఘవులు, జి రామకృష్ణన్, తపన్ సేన్, నీలోత్పల్ బసు ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి బివి రాఘవులకు రెండోసారి పొలిట్‌బ్యూరోలో స్థానం దక్కింది. సెంట్రల్ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా బసుదేవ్ ఆచార్య, పి రాజేంద్రన్, ఎస్ శ్రీ్ధర్, జి రాములు, బి బిశ్వాస్ నియమితులయ్యారు. కేంద్ర కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా విఎస్ అచ్యుతనందన్, మల్లు స్వరాజ్యం, మదన్ ఘోష్, పలోలి మహ్మద్ కుట్టీ, పి రామయ్య, కె వరదరాజన్ ఉన్నారు. మొత్తం 95మంది కమిటీలో ఏపీనుంచి పుణ్యవతి, పెనుమల్లి మధు, వి శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్, తెలంగాణ నుంచి జి నాగయ్య, తమ్మినేని వీరభద్రం, ఎస్ వీరయ్య, సిహెచ్ సీతారాములుకు స్థానం దక్కింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 800మందికి పైగా ప్రతినిధులు 95మంది కేంద్ర కమిటీ సభ్యులను తొలుత ఎన్నుకున్నారు. అనంతరం వీరు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. కొత్త ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం 17మంది పొలిట్‌బ్యూరో సభ్యులను ప్రకటించారు.

చిత్రం..కేరళ మాజీ సీఎం మాణిక్ సర్కార్‌తో సీతారామ్