రాష్ట్రీయం

30న ‘వంచన దినం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలపై గత నాలుగేళ్లుగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రజలను ఏవిధంగా వంచించిందీ తెలియజేసేందుకు ఈ నెల 30న ‘వంచన దినం’ పాటిస్తూ విశాఖలో ఒకరోజు సామూహిక నిరసన దీక్ష నిర్వహించాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా ఆగిరిపల్లి శిబిరంలో జరిగిన కీలక సమావేశం నిర్ణయించింది. ఎన్నికల సమయంలో తిరుపతిలో నేటి ప్రధాని నరేంద్ర మోదీ నాడు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలనే
డిమాండ్‌పై తెలుగుదేశం పార్టీ మొసలికన్నీరు కారుస్తూ ప్రజలను మరింతగా వంచించిందని జగన్ విమర్శించారు. ఈ రెండు పార్టీల వంచనను ప్రజలకు వివరించేందుకు విశాఖపట్టణంలో నిరసన దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ పదవులకు ఇటీవల రాజీనామా చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, శాసనమండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు ప్రభాకరరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కె పార్థసారథి, కరుణాకర్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..ఆగిరిపల్లిలో వైకాపా నేతలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్