రాష్ట్రీయం

ముగిసిన సీపీఎం మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: సీపీఎం పార్టీ 22వ జాతీయ మహాసభలు ముగిశాయి. గత ఐదు రోజులుగా కొననసాగిన మహాసభలు ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ముగిశాయి. ఈ నెల 18న ఆర్టీసీ కళ్యాణ మండలంలో పార్టీ సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం జెండా ఆవిష్కరణతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతోపాటు ముఖ్య నేతలు, 800 మంది ప్రతినిధులు, 80 మంది అబ్జర్వర్లు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. మతోన్మాద బీజేపీని గద్దె దించడమే తమ ప్రధాన అజెండా అంటూ సీతారాం ఏచూరి చేసిన ప్రారంభోపన్యాసం చేశారు. మైజారిటీ సభ్యుల ఆమోదంతో రాజకీయ తీర్మానాన్ని పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ ప్రవేశపెట్టారు. దేశంలో బలీయమైన శక్తిగా ఉన్న బీజేపీ అడ్డుకోవాలంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మద్దతు అవసరమని సీతారాం ఏచూరి అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా ఒంటరిగా పోరు చేయడమే మేలు అని కారత్ స్పష్టం చేశారు. దీంతో ఈ ఒక్క అంశంపైనే మూడు రోజుల పాటు విస్తృతంగా చర్చించి, మిగిలిన తీర్మానాలను ఒక్కరోజులో పూర్తి చేశారు.
చివరి రోజైన ఆదివారం సరూర్‌నగర్ స్డేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. బహిరంగ సభ సందర్భంగా నగర రహదారులన్నీ ఎరుపెక్కాయ. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులతో సరూర్‌నగర్‌కు చేరుకునే అన్ని దారుల్లో పార్టీ జెండాలు, తోరణాలతో నిండిపోయాయి. బహిరంగ సభ సందర్భంగా నిర్వహించిన రెడ్‌షెర్ట్స్ కవాతు మొత్తం మహాసభలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెయ్యి మంది యువకులు ఎర్రటి చొక్కాలను ధరించి మలక్‌పేట్ టీవీ టవర్ నుంచి కవాతుగా సభ కొనసాగిన సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎర్ర జెండా విశిష్టతను వివరిస్తూ తెలుగు, బెంగాలి, కేరళ కళాకారులు పాడి, ఆడి మనస్సులను దోచుకున్నారు. భారీగా తరలివచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేవలం సభను వీక్షించేందుకు స్టేడియంలో ఆరు ఎల్‌ఇడీ స్క్రీన్లతో పాటు మరో ఆరు స్క్రీన్లను స్టేడియం వెలుపల ఏర్పాటు చేశారు.
బహిరంగ సభ సందర్భంగా పోలీసులు గట్టిబందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో జన సమీకరణతోపాటు జాతీయ స్థాయిలో నాయకులు పాల్గొనడంతో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా స్టేడియంలోనికి వచ్చే వారిని ప్రత్యేక తనిఖీలు నిర్వహించి లోనికి అనుమతించారు.