రాష్ట్రీయం

మోదీ విధానాల వల్లే కాశ్మీర్‌లో విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: కాశ్మీర్ సమస్యపై రాజకీయ చర్చల ప్రక్రియను ప్రారంభించాలని సీపీఎం 22వ జాతీయ మహాసభలు ఆదివారం ఇక్కడ తీర్మానంలో డిమాండ్ చేశాయి. కాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి దిగజారడంపై సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వం కాశ్మీర్ పట్ల అనుసరిస్తున్న విధానాలు విఫలమయ్యాయన్నారు. మోదీ పాశవిక వైఖరివల్ల మిలిటెంట్లవైపు యువత ఆకర్షితులవుతున్నారన్నారు. మతపరంగా సమాజం చీలిపోయిందని, మోదీ అనుసరిస్తున్న దుందుడుకు విధానాలు కాశ్మీర్‌లో విధ్వంసానికి దారితీస్తోందన్నారు. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు రాజకీయ చర్చల ప్రక్రియను చేపట్టాలని సీపీఎం మహాసభలు డిమాండ్ చేసింది. పాకిస్తాన్‌తో కూడా చర్చల ప్రక్రియను ప్రారంభించాలని, దీనివల్ల కాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు అవకాశం ఉంటుందని సీపీఎం అభిప్రాయపడింది. మరో తీర్మానంలో ఉన్నత విద్యను వ్యాపారీకరణ చేయడం మానుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ రంగంలోనే విద్యా సంస్థలను నెలకొల్పాలని కోరింది. ఉన్నత విద్యా సంస్థలకు గ్రాంట్ల రూపంలో నిధులు ఇవ్వాలని, రుణాలు ఇవ్వకూడదని కోరింది. వర్శిటీలు, ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులకు స్వస్తి చెప్పాలని కోరారు. పరిశోధన రంగానికి ఇతోధికంగా నిధులు పెంచాలన్నారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణకు అడ్డుకట్టవేయాలని సీపీఎం మహాసభలు పిలుపునిచ్చాయి.

చిత్రం..హైదరాబాద్‌లో రెడ్‌షర్ట్స్ వలంటీర్ల కవాతు