రాష్ట్రీయం

టీటీడీ పదవి వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 22: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి చుట్టూ ముసిరిన వివాదాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యురాలిగా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే ఆమె హిం దువు కాదని క్రిష్టియన్ అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. తన బ్యాగ్‌లో, కారులో బైబులు ఉం టుందని, బైబుల్ లేకుండా తాను బయటకు వెళ్లనని అనిత ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వివాదానికి దారితీసింది. ఈ వీడియో ముఖ్యమంత్రి కా ర్యాలయం వరకూ వెళ్లడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. టీటీడీ బోర్డు చైర్మన్‌తోపాటు, స భ్యుల నియామకం వివాదాస్పదం కావడాన్ని పా ర్టీలన్నీ చంద్రబాబును తప్పుపట్టాయి. హిందు ధర్మానికి వ్యతిరేకంగా టీటీడీ బోర్డు నియామకాలు జరుగుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి అనిత ఉపక్రమించారు. టీటీడీ బోర్డు సభ్యురాలి పదవి తనకు వద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. తనపై నమ్మకంతో మీరు ఈ పదవి ఇచ్చారని, కానీ కొన్ని శక్తులు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయి. వీరి చర్యలు తనను ఎంతగానో నొప్పిస్తుండడంతో ఈ పదవిని వదులుకోవాలనుకుంటున్నానని అనిత ఆ లేఖలో పేర్కొన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే అనిత రాసిన లేఖ