రాష్ట్రీయం

ఎంచుకున్న విభాగాల్లో సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో తాము ఎంచుకున్న విభాగాల్లో శ్రీవారి సేవకులు సేవలు అం దించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. తిరుమలలో ముఖ్యమైన విభాగాలైన అన్నదానం, ఆరోగ్యశాఖ, నిఘా-్భద్రత, కల్యాణకట్ట, వసతి విభాగాలతోపాటు హెల్ప్‌డెస్క్, తిరునామం తదితర సేవలను ఎంచుకుని 3 రోజులు, 4 రోజులు, 7 రోజులు సేవ చేసే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. నూతనంగా చేపట్టిన ఈ విధానం ద్వారా ఏప్రిల్ 25వ తేదీ నుంచి భక్తులు ఆన్‌లైన్ ద్వారా తమ పేరు నమో దు చేసుకోవచ్చు. మే 2వ తేదీన తిరుమలలో సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం శ్రీవారి సేవకులు బృందాలుగా, వ్యక్తిగతంగా శ్రీవారి సేవ చేసేందుకు ఆన్‌లైన్ నమోదు చేసుకుంటారు. మే, జూన్ నెలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని జూలై నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ఈ అవకాశాన్ని శ్రీవారి సేవకులు వినియోగించుకోవాలని టీటీడీ కోరుతోంది.