రాష్ట్రీయం

ఉద్యమంగా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో అందరికీ నీటి భద్రత, విద్యుత్ భద్రత, గ్యాస్ భద్రత ఇచ్చామని, వౌలిక సదుపాయాలు కల్పించి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామని, అందరూ కలిసి అభివృద్ధిని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు - ప్రగతిపై ఆయన సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోటు వర్షపాతం ఉన్నా ఈ ఏడాది 2 అడుగులు భూగర్భజల మట్టం పెరిగిందంటూ, నీరు - ప్రగతిలో సాధించిన విజయాలకు అభినందనలు తెలిపారు. పంట కుంటలు, కాంటూరు ట్రెంచింగ్ పనులు వేగవంతం చేయాలని, దేశంలో లక్ష పంటకుంటలు పూర్తయిన తొలిజిల్లాగా అనంతపురం నమోదు కావాలని ఆదేశించారు. ఒక మీటర్ భూగర్భజలం పెరిగితే 90 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని, భూగర్భ జలమట్టం 15 మీటర్ల కంటే లోతుగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది ‘ఉపాధి’ నిధులు రూ. 8200 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ. 1000 కోట్లు మన సామర్థ్యంతో పెంచుకోవచ్చన్నారు. రూ. 10 వేల కోట్ల ఉపాధి నిధుల వినియోగం లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. ఇప్పటికే వేజ్ కాంపోనెంట్ నిధులు పెండింగ్ రూ. 83 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఒక వైపు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడం, మరో వైపు అభివృద్ధి పనులు కుంటుపడకుండా చూడటంలోనే మన సమర్థత చూపాలని కోరారు. ఈ ఖరీఫ్‌లో 100 శాతం యంత్రీకరణకు వెళ్లామని, తెగుళ్ల బెడద పూర్తిగా నియంత్రించాలన్నారు. నాణ్యమైన పంట దిగుబడులకు ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది రబీలో తెగుళ్ల బెడదను పూర్తిగా నియంత్రించామన్నారు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు మన వ్యవసాయ దిగుబడులు చేరుకోవాలన్నారు. క్రిమి సంహారక మందుల వినియోగం తగ్గించాలని, రసాయన ఎరువుల వినియోగం తగ్గాలన్నారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలన్నారు. నెల్లూరు జిల్లాలో సోమశిల, కందలేరు పరిధిలో అటవీ అనుమతులు వస్తే 23వేల ఎకరాల అదనపు ఆయకట్టు పెరిగే అవకాశముందన్నారు. ఊబరైజేషన్‌ను మెకనైజేషన్‌తో అనుసంధానించాలని, వాహనాలు, యంత్రాలు సమకూర్చడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని, అవసరాన్ని బట్టి వాహనాలు, యంత్రాలను తమిళనాడు నుంచి కూడా సమకూర్చుకోవాలన్నారు. రైతులను భాగస్వాములను చేస్తే 20 శాతం ధర తగ్గే అవకాశముందన్నారు. దుక్కిలో, పంట కోతల్లో మేలైన విధానాలు అనుసరించాలన్నారు.
ఒక వారం మండల శివారులో గ్రీవెన్స్
జిల్లా కేంద్రానికి వచ్చేందుకు ఫిర్యాదుదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఒక వారం జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరించాలని, తరువాత వారం మండల శివారు కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. అనంతపురం జిల్లాలో గ్రీవెన్స్ నమూనాను అన్ని జిల్లాల్లో అమలు చేయాలన్నారు. దీని వల్ల ప్రజల్లో మరింత సంతృప్తి పెరగడంతో పాటుగా అధికార యంత్రాంగం ప్రజలకు చేరువ అవుతుందన్నారు.