రాష్ట్రీయం

తెరాస ప్లీనరీ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెరాస ప్లీనరీ అత్యంత కీలకమని, ఇదే వేదికపై దేశ రాజకీయాల తాజా పరిణామాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చర్చిస్తారని మంత్రి తారకరామారావు తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరుగబోయే ఈ ప్లీనరీ అత్యంత కీలకంగా మారబోతుందన్నారు. తాజా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత చేకూరనుందన్నారు. ఈనెల 27న కొంపల్లిలో జరుగునున్న తెరాస ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి కేటిఆర్ పరిశీలించారు. అనంతరం కేటిఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారాయన్నారు. వీటిని ప్లీనరీ వేదిక నుంచి దేశ ప్రజలకు విడమరిచి చెబుతామన్నారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి ఫెడరల్ ఫ్రంట్‌పై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, తెలంగాణ ఏర్పాటును సీపీఎం అడ్డుకున్నప్పటికీ రాష్ట్రం ఏర్పడినట్టే, ఫెడరల్ ఫ్రంట్‌ను అడ్డుకున్నా ఆగేది కాదన్నారు. ఫ్రంట్‌ను మూసీనదితో ఏచూరి పోల్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, మూసీని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్న విషయం ఆయనకు తెలీదేమో అని చమత్కరించారు. ఫ్రంట్‌ను ఏ విధంగా బలోపేతం చేయాలో
తమ పార్టీ అధినేత కేసిఆర్‌కు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ ఏర్పడి 17 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగనున్న ప్లీనరీ నుంచి పార్టీ విధానాలపై ప్రజలకు మార్గదర్శకం చేయడంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే విధంగా నిర్వహిస్తామన్నారు. ఈ ప్లీనరీకి 13 వేల మంది ప్రతినిధులు ఆహ్వానించామని, ప్రతీ నియోజకవర్గం నుంచి 100 మంది ప్రతినిధులు వస్తారన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందన్నారు. ప్లీనరీని విజయవంతం చేయడానికి మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులతో తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేసామన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతినిధులకు ఇబ్బంది కలుగుకుండా అంబలి, మజ్జిగా, మంచినీటి వసతీని ఏర్పాటు చేసామన్నారు. గతంలో మాదిరిగానే వివిధ రకాల తెలంగాణ వంటకాలను తయారు చేస్తున్నామన్నారు. భోజనాల వద్ద ఇబ్బంది కలుగకుండా ప్లీనరీ ప్రాంగణంలో ఎనిమిది భోజనశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్లీనరీ శుక్రవారం రావడంతో ముస్లింలకు ప్రాంగణంలో నమాజ్ చేసుకోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

చిత్రం..ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్