రాష్ట్రీయం

శరవేగంగా రైతుబంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైతుబంధు పథకం అమలుకోసం యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు తీరిక లేకుండా ఉన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో పాటు బ్యాంకు సిబ్బందికి మే చివరి వరకు సెలవులు ఇవ్వవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. గత ఆరు నెలల నుండి సేకరించిన వివరాలకు అనుగుణంగా రైతుబంధు పథకం లబ్దిదారుల (రైతుల) పేర్లను ఖరారు చేశారు. ఇప్పటికే వీరి పేర్లతో చెక్కుల ముద్రణకు ఏర్పట్లు జరిగాయి. దాదాపు 96 శాతం మంది రైతుల పేర్లు ఇప్పటికే ఈ పథకంలో చేరాయి. ముఖ్యమంత్రి తాజాగా నిర్వహించిన సమావేశం తర్వాత జిల్లాలకు చేరిన కలెక్టర్లు గత రెండు రోజుల నుండి సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాల్లో రైతుబంధు పథకానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను ప్రభుత్వం ఏరోజుకారోజు సేకరిస్తోంది. రైతుబంధు పథకానికి సంబంధించి మే 10 నుండి పంపిణీ అవుతున్న చెక్కుల వివరాలు ఏరోజుకారోజు సేకరించేందుకు నేషనల్ ఇన్‌పర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు ఎన్‌ఐసి సమావేశ మందిరంలో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల నుండి వచ్చిన జిల్లా ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్లు (డిఐఓ) లకు రైతుబంధు పథకంపై అవగాహన కల్పించారు. చెక్కుల పంపిణీలో ఇన్‌పర్మేషన్ టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలో జిల్లా, మండల, గ్రామస్థాయి సిబ్బందికి డిఐఓలు సహకరించాలని నిర్ణయించారు. రైతుబంధు, ఎంఐఎస్ పోర్టల్ వినియోగంపై డిఐఓలు గ్రామ, మండల, జిల్లా అధికారులకు సాంకేతిక సమాచారాన్ని అందిస్తారు. గ్రామస్థాయి వ్యవసాయ అధికారులందరికీ ట్యాబ్‌లను ఇవ్వాలని నిర్ణయించారు.