రాష్ట్రీయం

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ పనితీరు అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం పనితీరు బాగుందని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రొబెషనరీ డిఎస్పీలు పేర్కొన్నారు. తమ శిక్షణలో భాగంగా సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన 36 మంది ప్రొబెషనరీ డిఎస్పీల బృందానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కమాండ్ సెంటర్ పనితీరు గురించి వివరించారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ సిటీలో చేపట్టిన కొత్త ఆవిష్కరణల గురించి ఆయన తెలిపారు. హైడ్‌కాప్, కమ్యూనిటీ సిసిటివి నెట్‌వర్క్, హవక్ ఐ వంటి ఆధునాతన ఆవిష్కరణలు ఎలా పని చేస్తుందీ తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీటిని అమలు చేసి నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలు, పలు రకాల డేటాను తక్షణం సమకూర్చేవిధంగా డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి ఇప్పటికే చర్యలు తీసుకున్నారని తెలిపారు. నగరంలో నేరాల నిరోధానికి, నేరస్తుల జాబితా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేవిధంగా ఈ యాప్ ఆధారిత సాంకేతిక ఆవిష్కరణలు పని చేస్తున్నాయని అన్నారు. నగర శాంతిభద్రతల విభాగం అదనపు సిపి డిఎస్ చౌహాన్, పరిపాలన విభాగం అదనపు సిపి టి.మురళీకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సిపి డాక్టర్ తరుణ్‌జోషి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం..కమాండ్ కంట్రోల్ పనితీరు గురించి కర్ణాటక ప్రొబెషనరీ డిఎస్పీలకు వివరిస్తున్న హైదరాబాద్ సీపీ అంజనీకుమార్