రాష్ట్రీయం

నియామకాలకు నోటిఫికేషన్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణలో తక్షణం నియామకాలు చేపట్టేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిషికేషన్లు జారీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు 42సార్లు ధర్నాలు, సభలు జరిపినా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. గూప్-1 అధికారుల కొరత భారీగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. గ్రూప్-3లో 8వేలు, గ్రూప్-4లో 36వేల క్లరికల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇంజనీరింగ్, డాక్టర్, పారామెడికల్ ఇతర టెక్నికల్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక ఖాళీ కూర్చీలే దర్శనం ఇస్తున్నాయని, జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాలల్లో వేలాదిగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. చివరి ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలు కొనసాగే సచివాయలంలో కూడా చాలినంత సిబ్బంది లేక పోవడంతో ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందని వివరించారు. గత 10 ఏళ్లుగా వివిధ శాఖల్లో ఎంత మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు, ఎన్ని భర్తీ చేశారు, ఇంకా ఎన్ని భర్తీ చేయాల్సి ఉందని అన్న విషయాలను సేకరించేందుకు ఉన్నతాధికారులు సమీక్ష సమావేశాలు జరపి స్పష్టత ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పాలన స్థంభించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు వెలుతున్న వారికి సాకాలంలో పనులు జరగక నరకయాతన అనుభవిస్తున్నారని వాపోయారు.