రాష్ట్రీయం

దళితుల ఐక్యతకు ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఐక్యత కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ, ఆర్థిక ఫలాలను అందించే దిశలో నిబద్ధతతో ముందుకు వెళతానని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ తెలిపారు. సోమవారం ఎపీ ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ లిమిటెడ్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన రెండవ సారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లగలిగామని, తన పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెండవ సారి ఆ బాధ్యతలను అప్పగించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పేదవర్గాలకు చెందిన దళితులను ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషిని కొనసాగిస్తానన్నారు. పేదవర్గాలకు చెందిన ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులకు బ్యాంకులు రుణాలు అందించడంలో వెనుకడుగు చేస్తుందని, ఆ దిశలో మరింతగా కృషి చేసి వారిని ఆర్థికంగా బలోపేతానికి బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు పని చేస్తానన్నారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు కృషి చేయడంతోపాటు అవగాహన కార్యక్రమాలను విస్తృత స్థాయిలో అమలు చేస్తామన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లి వారి ఆలోచనలను మేళవించి ముందుకు వెళతామన్నారు. ఈ దిశలో అన్ని వర్గాల సహకారం కావాలని సమిష్టితత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ప్రభుత్వం అందించే అన్ని కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ వీసీ, ఎండీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ జూపూడి ప్రభాకర్ గత రెండు సంవత్సరాలుగా సమర్థవంతంగా పని చేస్తూ అందరినీ కలుపుకుని వెళుతున్నారని, రెండవసారి కూడా ఆయననే చైర్మన్‌గా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఎస్సీల ఆర్థిక, సామాజిక అభివృద్ధి, సాధికారత కోసం 13 జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టడం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌కు అభినందనలు తెలిపిన వారిలో ప్రభుత్వ విఫ్ వెంకట మల్లికార్జునరావు, జనరల్ మేనేజర్ పి సారయ్య, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు జీ ఆదయ్య, కోటేశ్వరరావు, పీ రమేష్, బీవీ రమణ, శ్యామసుందరి, విల్సన్ ప్రభాకర్ వివిధ సంఘాల ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.