రాష్ట్రీయం

నష్టాలను కుదించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర రాజధాని అమరావతి నగర మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి ముసాయిదా ప్లాన్‌పై వచ్చిన అభ్యంతరాల్లో 90శాతాన్ని పరిష్కరించటమే కాకుండా రహదారుల వల్ల 3వేల ఇళ్లు దెబ్బతినకుండా ఉండేలా రూపొందించిన తుది బృహత్ ప్రణాళికను మున్సిపల్ మంత్రి పి నారాయణ సోమవారం రాత్రి విజయవాడలో విడుదల చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ముసాయిదా ప్రణాళికపై ప్రజలనుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రోడ్ల అలైన్‌మెంట్‌లో మార్పులు చేశామన్నారు. దీనివల్ల అతి తక్కువ ఇళ్లు మాత్రమే తొలగించాల్సి వస్తుందన్నారు. తొలుత 3600 ఇళ్లను తొలగించాల్సి ఉండగా, ప్రస్తుతం నెక్కల్లు, శాఖమూరు, ఐనవోలు గ్రామాల్లో కేవలం 360 ఇళ్లు మాత్రమే దెబ్బతింటాయని, ఈమేరకు అలైన్‌మెంట్ మార్చామన్నారు. ఈస్ట్ నుంచి వెస్ట్‌కు 18కి.మీల మేర ఒక రహదారిని, నార్త్, సౌత్ మధ్య 8కి.మీల మధ్య వున్న 5 రహదారులను మార్పు చేసినట్టు తెలిపారు. 29 గ్రామాల్లో ప్రస్తుత రహదారులు యథాతథంగా ఉంటాయన్నారు. కృష్ణానది కరకట్ట అలైన్‌మెంట్‌లో మార్పులు లేవన్నారు. పాలవాగు, కొండవీటి వాగు లోతట్టు ప్రాంతాల్లో మున్ముందు వరద బెడద లేకుండా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో రిజర్వాయర్లు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. ఇక 32 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు వారి గ్రామాల్లోనే ప్లాట్లు కేటాయించే ప్రక్రియను ఈనెల 28 నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ముందుగా నోటిఫికేషన్లను ఆయా గ్రామాల వారీగా విడుదల చేస్తామని, దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం వారికి కూడా ఆయా గ్రామాలకు దగ్గరలోనే ప్లాట్లు కేటాయించేలా తుది ప్రణాళికలో మార్పులు చేశామన్నారు. అన్ని గ్రామాల్లోనూ కమర్షియల్ ప్లాట్లు వస్తాయని మంత్రి నారాయణ వివరించారు. సమావేశంలో సిఆర్‌డిఏ కార్యదర్శి అజయ్ జైన్, కమిషనర్ శ్రీకాంత్ నాగులాపల్లి, అదనపు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు.

చిత్రం... రాజధాని ఫైనల్ మాస్టర్ ప్లాన్‌ను వివరిస్తున్న మంత్రి నారాయణ