రాష్ట్రీయం

ముగిసిన ఏపీ ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 25: రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు నిర్వహించిన ఏపీ ఎంసెట్-2018 బుధవారంతో ముగిసింది. ఈ నెల 22,23,24 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించగా, చివరి రోజైన బుధవారం అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు చెప్పారు. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాలకు మొత్తం 76, 752 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావల్సి ఉండగా 73,371 మంది హాజరయ్యారన్నారు. 3381 మంది గైర్హాజరయ్యారన్నారు. మొత్తం 95.59శాతం మంది వి ద్యార్థులకు హాజరయ్యారు. మూడు రోజుల పా టు నిర్వహించిన ఇంజనీరింగ్ పరీక్షలకు లక్షా 99వేల 437 మంది హాజరుకావల్సి ఉండగా లక్షా 90వేల 924 మంది మంది హాజరయ్యారన్నారు. ఇంజనీరింగ్ పరీక్షలకు మూడు రోజులూ కలిపి 95.73 శాతం హాజరు నమోదయ్యిందన్నారు. ఆం ధ్రప్రదేశ్‌లోని 43 రీజనల్ సెంటర్లు, హైదరాబాద్ లో 3 రీజనల్ సెంటర్లు మొత్తం 46 రీజనల్ సెంటర్ల పరిధిలో 137 పరీక్షా కేంద్రాల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రశ్నాపత్రాలను నిర్ధారించిన కీతో సరిపోల్చుకోవడానికి ఆన్‌లైన్ జవాబుపత్రాన్ని అభ్యర్థుల ఈమెయిల్‌కు పంపామన్నారు. ఈమెయిల్ ద్వారా జవాబుపత్రం అందనివారు వెబ్‌సైట్ నుం డి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ప్రాథమిక కీని గురువారం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, వాటిపై ఏ విధమైన అభ్యంతరాలున్నా ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఎంసెట్ కార్యాలయానికి తెలియజేయాలన్నారు. ఎంసెట్ ఫలితాలను మే 3న విడుదలచేస్తామన్నారు. ఇంట ర్ కాకుండా సీబీఎస్‌ఈ, ఏపీవోఎస్‌ఎస్, టీఎస్‌వోఎస్‌ఎస్, ఎన్‌ఐవోఎస్, డిప్లమో, ఆర్‌జీయూకేటీ, ఐఎన్‌సీ తదితర బోర్డుల నుండి ఎంసెట్‌కు హాజరైన అభ్యర్ధులు తమ హాల్‌టిక్కెట్‌తో పాటు డౌన్‌లోడ్ చేసుకున్న డిక్లరేషన్ ఫారంను పూర్తిచేసి, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఏపీ ఎంసెట్ కార్యాలయానికి ఈమెయిల్ లేక తపాలా ద్వారా అందజేయాలని కోరారు. డిక్లరేషన్ ఫారం సహా అటెస్టేషన్ చేయించిన మార్కుల జాబితాలను పంపిన పక్షంలోనే వారి మార్కుల వెయిటేజీని తీసుకుని, ఎంసెట్ మార్కులతో కలిపి ర్యాంకులు వెల్లడిస్తామని చెప్పారు. ఇతర వివరాలు, సందేహాల నివృత్తికి 0884-2340535, 0884-2356255 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కన్వీనర్ డాక్టర్ సాయిబాబు సూచించారు..