రాష్ట్రీయం

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వీఆర్‌ఎస్‌కు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహారాష్ట్ర పోలీసు శాఖలో అదనపు డీజీ, ఉమ్మడి ఏపీ లో సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ వి రమణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత నెల లో లక్ష్మీనారాయణ వ్యక్తిగత కారణాలతో తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ మేరకు ఆయన దరఖాస్తుకు ఇప్పుడు ఆమోదముద్ర పడింది. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం విపరీతంగా జరిగింది. గతంలో లక్ష్మీనారాయణ కూడా స్పంది స్తూ తా ను స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశానని, ఆమోదం లభించిన తర్వాత భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేశా రు. ఇ ప్పుడు రాజీనామా ఆమోదంతో ఆయన ఏ పా ర్టీలో చేరతారనే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. లక్ష్మీనారాయణ మా త్రం తా ను ఏ పార్టీలో చేరేది ఇంకా తేల్చుకోలేదని, తర్వా త తెలియజేస్తానని ఆయనే స్వ యంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌లో ఆయన చాలా కీ లకమైన కేసులను సీబీఐలో నమోదు చేసి దర్యాప్తు చేశా రు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, ఇంకా చాలామంది పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులను అరెస్టు చేసి జైలుకు పం పించారు. ఇంకా వారంతా వాయిదాలకు హాజరవుతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పలు కేసుల్లో చార్జిషీట్లను సైతం సీబీఐ దాఖలు చేసిం ది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీలోని ఏదో ఒక పార్టీ లో చేరతారనే ప్రచారానికి రెండు, మూడు రోజు ల్లో తెరపడుతుందని భావిస్తున్నారు.