రాష్ట్రీయం

ఫెడరల్ ఫ్రంట్‌కు శంఖారావం -- నేడు టీఆర్‌ఎస్ ప్లీనరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్జాల చంద్రశేఖర్
హైదరాబాద్, ఏప్రిల్ 26: దక్షత, విజ్ఞత, వివేచన, విచక్షణ.. ఇవి ముఖ్యమంత్రి కేసీఆర్ విజయ సోపానాలు. ఆయన ఎటు అడుగు వేసినా అది విజయబాటే.. ఎంతటి విజయానికైనా దారులు తీసేది తొలి అడుగే.. ఆ తొలి అడుగు ఎప్పుడు వేయాలి, ఏ విధంగా వేయాలన్న విజ్ఞతాయుత ఆలోచన చేయడంలో దిట్ట కేసీఆర్. అలాంటి అవసరం,అగత్యం అరుదెంచింది కాబట్టే దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఆయన దృష్టి పెట్టారు. దశాబ్దాల తెలంగాణ కలను సఫలం చేసుకున్న కేసీఆర్ రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛను ఈడేర్చడంలోనూ అంతే అంకిత భావం ప్రదర్శించారు. అధికారం అందుకున్న తొలి రోజునే తన భావి లక్ష్యాలకు తొలి అడుగుగా భావించిన కేసీఆర్ నాలుగేళ్లుగా రాష్ట్ర ఖ్యాతిని భిన్నరంగాల్లో ఇనుమడించారు. వ్యాపారం, వాణిజ్యం, సామాజిక, అభివృద్ధి లక్ష్యాలను తనదైన దక్షతతో నెరవేర్చుకున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ శంఖారావంతో జాతీయ రాజకీయ ప్రవేశానికి నాందీ ప్రస్తావన చేయనున్నారు. అందుకు ఎన్నో విజయాలకు వేదికైన పార్టీ ప్లీనరీనే ఆలంబనగా చేసుకుంటున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించే ప్లీనరీ వేదిక నుంచే జాతీయ రాజకీయాల దిశగా ఆయన తొలి అడుగు పడబోతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏటా నిర్వహించే సాధారణ ప్లీనరీకి, ఈ సారి నిర్వహించే ప్లీనరీకి మధ్య గుణాత్మకమైన తేడా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధననే లక్ష్యంగా ఆవిర్భావించిన టిఆర్‌ఎస్ పార్టీ మొదటి మజిలి రాష్ట్ర సాధనతో పరిపూర్ణమైంది. ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే దిశగా సాగిన రెండవ మజిలి కూడా ఫలవంతానికి చేరుకోవడంతో ఇక మూడో మజిలికి ఈ సారి జరిగే ప్లీనరీ నాంది ప్రస్తానం కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన, బంగారు తెలంగాణ సాధనతో ఇంట గెలిచిన టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ రచ్చ కూడా గెలిచేందుకు సిద్ధం చేసుకున్న ఫెడరల్ ఫ్రంట్‌కు ఇదే ప్లీనరీ నుంచి శంఖారావం పూరించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తితో ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణంలోనూ పార్టీ శ్రేణులు భాగస్వామ్యులను చేయడానికి ఇదే వేదిక నుంచి మార్గనిర్దేశం చేయబోతున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అవిర్భావించి 17 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సారి నిర్వహించబోయే ప్లీనరీ, ప్రతీ ఏటా సాధారణంగా నిర్వహించే ప్లీనరీలాంటిది కాదు. దేశ రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషించేందుకు సర్వసన్నద్ధమైన టిఆర్‌ఎస్‌ను ఇదే ప్లీనరీ వేదిక నుంచి దీవించి కదనానికి పార్టీ శ్రేణులు తిలకం దిద్దబోతున్నారు.
కాంగ్రెస్, బిజెపిల కూటమీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కాబోతున్న ఫెడరల్ ఫ్రంట్‌కు ఈ ప్లీనరీ దిశా, దశను చేయనుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తన నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలను, బంగారు తెలంగాణ ఆశయం దిశగా వేసిన అడుగులను పార్టీ శ్రేణులకు విడమరిచి చెప్పి, అదే విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీని వేదికగా చేసుకుని మార్గనిర్దేశం చేయనున్నారు.