రాష్ట్రీయం

విద్యార్థుల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను శాస్త్ర సాంకేతిక రంగాల్లో చైతన్య పరచడం ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్ధుల సేవలను పొందే కొత్త కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నాందిపలికింది. ఈ కార్యక్రమం గురువారం నా డు ప్రారంభమైంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి రెండు నిట్‌లు, రెండు ఐఐటిలతో పాటు పలు ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు భాగస్వామ్యం అవుతున్నారు. ఈ పథకానికి సంబంధించి గత ఏడాది జనవరి 12వ తేదీన కేంద్ర పంచాయితీరాజ్ శాఖ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖల మధ్య ఒప్పందం కుదిరింది. ఉన్నత విద్యాసంస్థలు నిరంతరం గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలతో అనుసంథానమై గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచించడంలో కూడా తోడ్పడతారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఢిల్లీ ఐఐటి సమన్వయం చేస్తుంది. వివిధ దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు. తొలి దశలో 750 విద్యాసంస్థలు 45వేల గ్రామాల్లో తమ కార్యాచరణ ప్రారంభిస్తాయి. ఒక గ్రామాన్ని లేదా ఆ గ్రామంలో ఒక వాడను ఎంపిక చేసుకుని విద్యార్ధులు అక్కడి ప్రజల సమస్యలు, అవసరాలు, నిధుల పరిస్థితులను అధ్యయనం చేసి ఆ సమస్యలను పరిష్కరించేందుకు తమ జ్ఞానాన్ని, అవగాహనను ఉపయోగించి నివేదికలను తయారుచేస్తారు. క్షేత్ర స్థాయిలో పర్యటించడం, ప్రతి ఒక్కరితో మాట్లాడటం, గ్రామీణ , పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమన్వయం చేయడం, అనుదిన సమస్యలపై వినూత్న పరిష్కారాలను సూచించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి తోడ్పడేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది. అయితే దేశంలోని అన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుచేసేందుకు ఎలాంటి కాలపరిమితిని నిర్దేశించలేదు. ఇందుకోసం కేంద్రం తొలి దశలో రూ.10 కోట్లు కేటాయించింది. దేశవ్యాప్తంగా 8252 ఉన్నత విద్యాసంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిని ప్రదర్శించాయి. అయితే తొలి దశలో 750 విద్యాసంస్థలను మాత్రమే కేంద్రం ఎంపిక చేసింది.