రాష్ట్రీయం

1 నుంచి రెరా చట్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: వచ్చే జూలై 1వ తేదీ నుంచి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్‌మెంట్ చట్టం (రెరా) 2016ను అమలు చేసేందు కు వీలుగా రాష్ట్రప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రెరా నిపుణులు ఇప్పటికే కర్నాటక, మహారాష్టల్రో పర్యటించి రెరా విధి విధానాల అమలును అధ్యయనం చేశారు. మహారాష్ట్ర రెరా విధానాలు సరళీకృతంగా ఉన్నాయని, వీటిని ఆదర్శంగా తీసుకుని అమలు చేసేందుకు వీలుగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. రెరా నియమావళి అమలులోకి వస్తే అధికారుల ప్రమేయాన్ని గణనీయంగా తగ్గించనున్నారు. ప్రాజె క్టు స్పెసిఫికేషన్స్‌తో ప్రాజెక్టు రిపోర్టును ఇచ్చిన వెంటనే ప్రభుత్వం వద్ద దరఖాస్తులు నమోదవుతాయి. నిర్ణీతకాలపరిమితిలోపల అనుమతు లు వస్తాయి. రెరా అథారిటీ వెబ్‌పోర్టల్ ద్వారా ప్రాజెక్టు నివేదికను పొందుపరుస్తారు. దీని వల్ల కొనుగోలుదారులు చూసి తమ ఆసక్తిని, అభ్యంతరాలను తెలియచేయవచ్చును. కస్టమర్లు ఫిర్యా దు చేస్తే సంబంధించిన సంస్థలపై జరిమానాను విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అపిలేట్ అథారిటీ, వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి ఒక వెబ్‌సైట్‌ను ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మహారాష్ట్ర ఆన్ లైన్ లిమిటెడ్ వెబ్‌ను రూపొందించిన టిసిఎస్‌ను సంప్రదించే అవకాశం ఉంది. జిహెచ్‌ఎంసి, మున్సిపాలిటీలు, రిజిస్ట్రేషన్ల శాఖ మధ్య సమన్వయాన్ని పెంపొందించనున్నారు. రెరా అమలులోకి వస్తే రియ ల్ ఎస్టేట్ డెవలపర్లు తమ ప్రాజెక్టులను చట్టప్రకారం విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రెరా ఏర్పాటైన త ర్వాత కనీసం హైదరాబాద్ పరిసరాల్లో 2000 ప్రాజెక్టులు రెరా చట్టం పరిధిలోకి వస్తాయని అంచనా. రెరా చటా టన్ని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం నోటిఫై చేసిన విషయం విదితమే.