తెలంగాణ

ఉడుత ఊపులకు భయపడేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురుమామిడి: రాష్టాన్ని తుగ్లక్‌ల పాలిస్తూ, ప్రతిపక్షాల గొంతు నొక్కాలని యత్నిస్తున్న సిఎం కెసిఆర్ ఉడుత ఊపులకు భయపడేది లేదని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, టిడిఎల్పీ నేత ఎనుముల రేవంత్‌రెడ్డి సిఎం కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. సోమవారం సిఎం దత్తత గ్రామమైన చినముల్కనూర్‌లో రేవంత్‌రెడ్డి... టిడిపి జాతీయ కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చింతకుంట విజయరమణరావుతో కలిసి పర్యటించారు. ముల్కనూర్‌లో సిఎం ఇళ్ల కూల్చివేతకు పూజ చేసిన ఇంటిని పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలో కలియతిరిగి ఇళ్లు కూల్చుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పర్యటించారు. ‘పేదలు గుడిసెల్లో ఉండొద్దు.. ఆత్మగౌరవంతో బతకాలి అని ప్రసంగాలు చేసి నేడు అదే పేదల ఆత్మగౌరవాన్ని బజారుకీడ్చారని’ ఆరోపించారు. కనీసం చిన ముల్కనూర్‌లో ఆడబిడ్డలు బహిర్భూమికి బయటకే వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, దీనిని చూస్తే వారి ఆత్మగౌరవాన్ని బజారు పాలు చేసినట్లు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న సిఎం నేడు అందరికంటే ముందుగా దత్తత తీసుకున్న చిన ముల్కనూర్‌లో చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. మోడల్ ఇల్లు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్‌కు ఇప్పటికీ బిల్లులు రాక అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడని ఇంత దౌర్భాగ్యపు దుస్థితి ఇంకేమైనా ఉంటుందా? అని విమర్శించారు. సిఎం వ్యవహశైలి ఇల్లు పీకి పందిరేసినట్లుందన్నారు. ఎన్నికలు వస్తే సిఎం కుటుంబ సభ్యులు అక్కడ హాజరై బంగారు తెలంగాణ చేస్తామన్నాంటున్నారు తప్ప అది ఆచరణలో సాధ్యం కావడంలేదన్నారు. చిన ముల్కనూర్‌లో త్వరిగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టకుంటే ప్రతిపక్షాలను కలుపుకొని రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నానీ, అసెంబ్లీని స్తంభింపజేస్తామన్నారు.

సోమవారం ముల్కనూర్‌లో విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న టిడిపి నేత రేవంత్‌రెడ్డి