తెలంగాణ

ఒసిటిఎల్ లాకౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని ఒసిటిఎల్ ఫ్యాక్టరీని యాజమాన్యం సోమవారం రాత్రి ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించింది. నాలుగు రోజుల క్రితం ఫ్యాక్టరీ ఎజిఎం కోయ మస్తాన్‌రావుపై కార్మికులు దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం ఉద్రిక్తతల మధ్య పరిశ్రమను నడిపించలేమని భావించి తాత్కాలిక లాకౌట్ ప్రకటించింది. ఈ మేరకు ఫ్యాక్టరీ ప్రధాన ద్వారానికి హెచ్‌ఆర్ ఇన్‌చార్జి శ్రీ్ధర్ పేరుతో లాకౌట్ నోటీస్ అంటించారు. గత కొంత కాలంగా ఒసిటిఎల్ యాజమాన్యానికి, కార్మికుల మధ్య తరుచూ వివాదాలు, సమ్మెలు చోటుచేసుకోవడం, చివరకు ఎజిఎంపై దాడి, ఆయన మృతికి దారితీయడం వంటి ఘటనలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో ఫ్యాక్టరీ నిర్వహణ కష్టమని తలిచిన ఫ్యాక్టరీ కామినేని యాజమాన్యం కంపెనీ లాకౌట్ ప్రకటించింది. ఆకస్మికంగా యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 1300మంది కార్మికుల కుటుంబాల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. యాజమాన్యం నిర్ణయంతో జీవనోపాధి కరువై తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని యాజమాన్యం లాకౌట్ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కార్మికులు కోరుతున్నారు.

మరో ఇద్దరు
రైతుల ఆత్మహత్య
చౌటుప్పల్ / రాజాపేట, ఫిబ్రవరి 22: నల్లగొండ జిల్లాలో ఇద్దరు రైతులు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడేళ్లుగా కరవు నేపథ్యంలో చేసిన అప్పులు తీర్చే దారి లేక మనస్తాపం చెందిన పత్తి రైతు శాబాదుల చంద్రారెడ్డి (57) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చౌటుప్పల్ మండలం లింగోజీగూడెం గ్రామంలో సోమవారం జరిగింది. అలాగే, రాజాపేట మండలం పుట్టగూడెం పంచాయతీ పరిధిలోని కొండేర్‌చెర్వుకు చెందిన రైతు వెల్మ కనకయ్య (32) చేసిన అప్పులు తీర్చేదారి లేక సోమవారం ఉదయం తన వ్యవసాయ బావి వద్ద చింత చెట్టుకు ఉరి వేసుకుని ఉసురు తీసుకొన్నాడు.