తెలంగాణ

8 జిల్లాలు గుడుంబా రహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు ఎనిమిది జిల్లాలను గుడుంబా రహిత జిల్లాలుగా గుర్తించామని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు తెలిపారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో సోమవారం ఆయన ఎక్సైజ్, ప్రొహిబీషన్ శాఖ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ, గుడుంబాను పూర్తిగా నిర్మూలించడం కంటే ముందు దాని తయారీపై ఆధారపడి జీవిస్తున్న వారిని గుర్తించి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరుస్తామని, త్వరలో 19 స్టేషన్లకు సొంత భవనాలను నిర్మించేందుకు రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. గతంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బందిపై నమోదైన ఎసిబి కేసుల పరిష్కారానికి కృషి చేస్తానని, న్యాయస్థానం ఆదేశాల మేరకు వారికి పదోన్నతులు కల్పించడం జరుగుతుందని పద్మారావు చెప్పారు. మండలానికి ఒక ఎక్సైజ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షులు వి.శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఇతర ఉద్యోగుల మాదిరిగా ఎక్సైజ్ ఉద్యోగులకు ఇళ్లు నిర్మించి హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రతిభ చూపిన వారిని సత్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

బడ్జెట్ సమావేశాల్లో
విపక్షాలు సహకరించాలి
కేంద్ర మంత్రి దత్తాత్రేయ వినతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: రాజకీయాలను పక్కన పెట్టి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విపక్షాలను కోరారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), కార్మిక చట్ట సవరణల బిల్లు తదితర కీలక బిల్లులకు పార్లమెంటు ఆమోదం తెలపాల్సి ఉందని దత్తాత్రేయ సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. దేశాభివృద్ధి దృష్ట్యా జిఎస్‌టి బిల్లుకు విపక్షాలు ఆమోదం తెలపాలని, గత సమావేశంలో కార్మికులకు బోసన్ 3500 నుంచి 7 వేల రూపాయలకు పెంచుతూ ప్రతిపాదించిన బిల్లుకు ఆమోదం తెలుపకపోతే కార్మికులకు పెంచిన బోనస్ లభించేది కాదని అన్నారు. కార్మిక సంక్షేమ శాఖకు చెందిన చట్టాలను సరళీకృతం చేసి నాలుగు చట్టాలుగా మార్చనున్నట్లు తెలిపారు. సంకుచిత ధోరణితో వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌కు వామపక్షాలు కూడా తోడయ్యాయని ఆయన విమర్శించారు. దేశ అభివృద్ధిని కాంగ్రెస్ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రధాని మోదీని అప్రతిష్టకు గురి చేసేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రివర్గంలో తెరాస చేరుతుందా? అని ప్రశ్నించగా, ఈ విషయాన్ని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పాలని దత్తాత్రేయ దాటవేశారు. రాష్ట్ర హైకోర్టు విభజనకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటున్నదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రైల్వే బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన అన్నారు.
చిన్నారిపై లైంగిక దాడి
చిత్తూరు జిల్లాలో టీచర్ అకృత్యం
పలమనేరు, ఫిబ్రవరి 22: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాల్టీ పరిధిలోని బోడిరెడ్డిపల్లి గ్రామ పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిని ఎంఇఓ ఆగ్నేస్ మందలించి పాఠశాల నుంచి వేరే పాఠశాలకు బదిలీ చేసినట్లు తెలిపారు. బోడిరెడ్డిపల్లి గ్రామంలోని పాఠశాలలో గడ్డూరు కాలనీకి చెందిన ఓ కుటుంబం తమ పదేళ్ల బాలికను పాఠశాలలో చేర్పించారు.
గత రెండు నెలల నుంచి సదరు ఉపాధ్యాయుడు బాలికపై లైగింక దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయుడి తీరును బాలిక తల్లిదండ్రులకు గత బుధవారం చెప్పింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు విద్యాశాఖాధికారి కార్యాలయానికి వెళ్లి ఉపాధ్యాయుని తీరుపై ఫిర్యాదు చేశారు. దీనిపై పలమనేరు ఎంఇవోను వివరణ కోరగా 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు అందిందని, దీనిపై ఉపాధ్యాయుడిని మందలించి డిప్యుటేషన్‌పై వేరే పాఠశాలకు పంపినట్లు తెలిపారు. అదేవిధంగా జరిగిన సంఘటనపై వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. కాగా తల్లిదండ్రులు ఆ బాలికను ఈ పాఠశాలలో తీసేసి వేరొక పాఠశాలలో చేర్పించారు.

హైదరాబాద్‌లో
ఉపాధి శిక్షణా కేంద్రం
ఎఐఎఫ్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలుగా వారికి అవసరమైన శిక్షణ అందించేందుకు హైదరాబాద్‌లో అమెరికన్ ఇండియా ఫౌండేషన్ (ఎఐఎఫ్)ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. క్యాప్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో మార్కెట్ అలైన్డ్ స్కిల్స్ ట్రైనింగ్ (మస్ట్) పేరుతో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఎఐఎఫ్ కంట్రీ డైరక్టర్ నిషాంత్ పాండే మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. ‘మస్ట్’ తరహాలో తాము ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 184 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

ఎన్‌డిఏలో చేరడం లేదు
తెరాస ఎంపీ కవిత స్పష్టీకరణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఎన్‌డిఏ ప్రభుత్వంలో తెరాస చేరడం లేదని ఆ పారీకి చెందిన నిజామాబాద్ ఎంపి కె.కవిత వెల్లడించారు. సోమవారం నాడిక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేవలం అంశాలవారీగా మద్దతు మాత్రమే ఇస్తాము తప్ప ఎన్‌డిఏ చేరేది లేదని స్పష్టం చేశారు. రానున్న రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించిన మేరకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరామన్నారు.

ఈసారి బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.