ఆంధ్రప్రదేశ్‌

ఏపీ హౌసింగ్‌లో నిధులు హాంఫట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ఫిక్స్డ్ డిపాజిట్ల ఫోర్జరీ కేసులో మంగళవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తొమ్మిది మంది అనుమానితుల ఇళ్లలో ఏపి సిఐడి పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏపి సిఐడి పోలీసులు తొమ్మిది బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. మెహిదీపట్నం, సరూర్‌నగర్, దోమలగూడ, వెస్ట్‌మారెడ్‌పల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో అనుమానితుల ఇళ్ళలో సోదాలు చేశారు. ఇటీవల ఘట్‌కేసర్, మెహిదీపట్నం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచిల్లో దాదాపు రూ. 30 కోట్లు ఏపి హౌసింగ్ బోర్డు నిధులు ఇతర ఖాతాల్లోకి మళ్లిన విషయం విధితమే.
ఈ బ్యాంకులోని నిధుల మళ్లింపు కేసులో ప్రధాన నిందితుడు దామోదర్ మురుగన్ సహ 9మందిపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు జరుపుతున్న విచారణలో భాగంగా మెహిదీపట్నం ఎస్‌బిహెచ్ బ్రాంచ్ మేనేజర్ కామరాజు నివాసంలో కూడా కర్నూలుకు చెందిన సిఐడి అదికారులు సోదా చేశారు. ఇప్పటికే పలు కీలక ఫైళ్లు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు, పొల్యూషన్ బోర్డుకు చెందిన నిధుల మళ్లింపుపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు. కేసు విచారణ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా కొలిక్కిరాలేదు. దీంతో ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని పలువురు డిమాండ్ చేయగా సిఐడిచే విచారణ చేపట్టారు. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లో తనిఖీలు చేపట్టినట్టు సిఐడి విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.