ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి లడ్డూలో పిన్నీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: భక్తులు అత్యంత పవిత్రమైన ప్రసాదంగా స్వీకరించే తిరుమల శ్రీవారి లడ్డూలో మంగళవారం మధ్యాహ్నం పిన్నీసు ప్రత్యక్షమైంది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ వద్ద ఉన్న టోకన్ ఇచ్చి లడ్డూను పొందుతారు. ఇందులో భాగంగానే మంగళవారం ఓ భక్తుడు తన వద్ద ఉన్న టోకన్‌ను 13వ కౌంటర్లోవున్న శ్రీవారి సేవకుడికి అందించాడు. ఈక్రమంలో శ్రీవారి సేవకుడు లడ్డూలు ఇచ్చే సమయంలో ఒక లడ్డూలో పిన్సీసు ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే ఆ లడ్డూని భక్తుడు నుంచి వెనక్కి తీసుకుని మరో లడ్డూ అందించాడు. అయితే ఈవిషయం బయటకు పొక్కనీయకుండా చేశారు. చివరకు మీడియాకు ఈవిషయం తెలియగానే అధికారులు ఆ లడ్డూను తీసుకుని పోటులో ఉన్న కార్మికులను ప్రశ్నించారు. లడ్డూ చుట్టే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.

శ్రీవారిలడ్డూలో వెలుగుచూసిన పిన్నీసు
(వృత్తాకారంలో)