తెలంగాణ

డంపింగ్ యార్డులో రూ. కోటి లభ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగర శివారులోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్ లభ్యమైన ఘటన కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం ఆర్డీఎఫ్ ఇన్‌చార్జి గురువారెడ్డి చెత్తను కటింగ్ చేస్తుండగా ఓ ఎరుపు రంగు ట్రావెల్ బ్యాగ్‌ను గుర్తించాడు. దాన్ని తెరచి చూడగా వెయ్యి రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. ఒక్కసారిగా ఖంగుతిన్న గురువారెడ్డి ఆ బ్యాగును డంపింగ్ యార్డు ఇన్‌చార్జి కోటేశ్వరరావుకు అందజేశాడు. కొద్ది సేపటి తరువాత ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. నోట్ల కట్టలు కలిగివున్న సదరు బ్యాగ్ విషయం డంపింగ్‌యార్డు అంతా దావనలంలా వ్యాపించింది. ఈ బ్యాగులో దాదాపు కోటి రూపాయలు ఉన్నట్టు తెలిసింది. సమాచారం తెలిసిన పోలీసులు హుటాహుటిన డంపింగ్ యార్డుకు చేరుకున్నారు. పోలీసులు ఇద్దరిని విచారించగా దొరికిన బ్యాగ్ కోటేశ్వర రావు వద్ద ఉందని గురువారెడ్డి చెప్పాడు. గురువారెడ్డి తనకు బ్యాగు ఇవ్వలేదని కోటేశ్వరరావు చెప్పాడు. కాగా మరో వైపు పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం సాగింది. అయితే పోలీసులు సదరు బ్యాగు లభ్యమైన విషయాన్ని ధ్రువీకరించక పోవడమే కాకుండా ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోలేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా డంపింగ్ యార్డులో నోట్ల కట్టల బ్యాగ్ దొరికిందన్న వార్త స్థానికంగా కలకలం రేపుతోంది.

80 లక్షల విలువైన
గంజాయి పట్టివేత
లారీ సీజ్, డ్రైవర్ అరెస్టు
మరో ముగ్గురి కోసం గాలింపు
సిద్దిపేట, ఫిబ్రవరి 23: అక్రమంగా లారీలో తరలిస్తున్న 80 లక్షల విలువైన సుమారు 4 క్వింటాళ్ల గంజాయిని మెదక్ జిల్లా రాజగోపాల్‌పేట పోలీసులు మంగళవారం తెల్లవారుజామున చాకచక్యంగా పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని సుమారు 200 గంజాయ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసి మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్ వెల్లడించారు. మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా కంగ్టి మండలం వంగ్దల్‌కు చెందిన రాథోడ్‌బాబు (25) స్నేహితులైన రాథోడ్ నారాయణతో కలిసి ఏపి 28డబ్ల్యు 9459 నంబరు గల లారీలో వరంగల్ నగర శివారులో గణపతి అనే వ్యక్తి నుంచి 200 ప్యాకెట్లు లారీలో లోడ్ చేసుకుని నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్ బలరాం, రాథోడ్ పూల్సింగ్‌లకు చేరవేసేందుకు వెళ్తుండగా తనిఖీలో భాగంగా రాజగోపాల్‌పేట ఎస్‌ఐ గోపాల్‌రావు లారీని ఆపారు. పోలీసులను చూసి డ్రైవర్ రాథోడ్‌బాబు, క్లీనర్ నారాయణ లారీ నుంచి దూకి పారిపోతుండగా పోలీసులు వెంబడించి డ్రైవర్‌ను పట్టుకున్నారు. తహశీల్దార్ ఫారూఖ్‌ఆలీ సమక్షంలో పంచనామా నిర్వహించి రాథోడ్‌బాబును అరెస్టు చేశారు. కేసులో నిందితునిగా ఉన్న రాథోడ్ నారాయణ, జాదవ్ బలరాం, రాథోడ్ పూల్సింగ్, గణపతి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గంజాయ విలువ 80 లక్షలు ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ గోపాల్‌రావును డిఎస్పీ అభినందించారు.
ఈ సమావేశంలో రూరల్ సిఐ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

త్వరలోనే నిందితుల ఆట కట్టిస్తామన్నారు.

క్లీనర్ నారాయణ పారిపోయాడు. పోలీసులు లారీని తనిఖీ చేయగా రెండు కిలోల బరువున్న 200 గంజాయి ప్యాకెట్లు లభించాయి. డ్రైవర్‌ను విచారించగా నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్‌బలరాం, రాథోడ్‌పూల్సింగ్‌లకు చేరవేసేందుకు తీసుకుపోతున్నానని, తనకు గణపతి అనే వ్యక్తి లారీలో సరుకు లోడ్ చేసినట్లు తెలిపారు.