ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ, వైసీపీ వాయిస్ ఒక్కటే: కేఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు మే 14: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆశీస్సుల కోసమే వైసీపీ అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాడని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. సోమవారం కర్నూలులో విలేఖరులతో మాట్లాడుతూ అలిపిరిలో అమిత్ షాపై చంద్రబాబు చేయించాడని జగన్ చెప్పటమే బీజేపీ, వైసీపీ లాలూచీకి నిదర్శనమన్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై తప్పుడు ఆరోపణలు చేసి విచారణలకు పట్టుబట్టడం, కేంద్రం నుంచి నిధులు రాకుండ అడ్డుకోవటం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం అన్నీ జగన్ కుట్రల్లో భాగమేన్నారు. జగన్ తన నోటితో బీజేపీ వాయిస్ వినిపిస్తున్నారని, ఆ పార్టీకి అద్దె మైకు లా మారారన్నారు. జగన్ అండ చూసుకునే బీజేపీ ఏపీ అభివృద్ధిపై శీతకన్ను వేసిందన్నారు. కేసుల నుంచి బయటపడడమే తనకు ముఖ్యమని, 2019 ఎన్నికల్లో గెలుపు ముఖ్యం కాదని, ముందు కేసుల నుంచి బయటపడితే ముఖ్యమంత్రి ఎప్పుడైనా కావచ్చని జగన్మోహన్‌రెడ్డి ఇటీవల బీజేపీ నేతలతో అంతర్గతంగా జరిపిన సంభాషణలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయన్నారు.
కన్నా.. వైసీపీకీ వర్కింగ్ ప్రెసిడెంట్: జూపూడి
విజయవాడ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడంతో ఆ రెండు పార్టీల లాలూచీ వ్యవహారం బట్టబయలయిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. కన్నా వైసీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తారంటూ ఎద్దేవా చేశారు. వెలగపూడిలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ కన్నా నియామకంతో ఆ రెండూ కవల పార్టీలని నిర్థారణ అయిందన్నారు. బీజేపీ చెప్పినట్లు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వింటున్నారా? జగన్ అజెండాను బీజేపీ అమలు చేస్తుందా? అనేది ఐదుకోట్ల ఆంధ్ర ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో వారు ప్రధానిని ప్రశ్నించరని, ముఖ్యమంత్రిని విమర్శిస్తారని అన్నారు.
జగన్ సలహాతోనే కన్నాకు పదవి: రాజేంద్రప్రసాద్
తిరుపతి: బీజేపీ, జగన్ మధ్య అవినీతి సంబంధం కొనసాగుతోందని, అందులో భాగంగానే వైకాపాలోకి వస్తానన్న కన్నా లక్ష్మీనారాయణకు జగన్ సలహాతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి జగన్ బీజేపీకి దాసోహం అంటున్నారని ఆరోపించారు. తద్వారా కర్ణాటకలో ప్రచారం చేసుకోవడానికి బీజేపీకి వైకాపా అధినేత జగన్ ఆర్థిక సహకారం అందించారని ఆరోపించారు. ఇలా బీజేపీ, జగన్‌లు పరస్పరం ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు.