రాష్ట్రీయం

‘పంచాయతీ’కి ఇదే సమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సానుకూల పవనాలు ఏర్పడ్డట్టు సీఎం, తెరాస అధినేత చంద్రశేఖరరావు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయ. సానుకూల పవనాలను సద్వినియోగం చేసుకునేందుకు ఈ జూన్‌లోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార పార్టీ మొగ్గు చూపించవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 10న ప్రారంభమైన రైతుబంధు చెక్కుల పంపిణీ 17న ముగుస్తుంది. అనుకోకుండా అదే రోజు గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. ఓటర్ల జాబితాకు తుది రూపం ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 10నుండి కసరత్తు మొదలుపెట్టింది. రాష్టస్థ్రాయి, జిల్లాస్థాయి, మండల స్థాయిలలో అఖిలపక్షం సమావేశాలు నిర్వహించి, ఓటర్ల జాబితాలో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దడంలో సహకరించాలని రాజకీయ పార్టీల నేతలను కోరారు. ఓటర్ల పేర్లలో మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చారు. అంటే ఓటర్ల తుది జాబితా రూపొందించడంలో రాష్ట్ర ఎన్నికల
సంఘం తనపై ఎలాంటి మచ్చరాకుండా చూసుకుంది. 2018 మే 17న ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల తుది జాబితా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఓటర్ల జాబితా ప్రకటించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక బాధ్యత పూర్తయినట్టు అవుతుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ బంతి ప్రభుత్వం కోర్టులోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే బాధ్యత ప్రభుత్వంపై పడుతుంది. 17న తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాంకేతికపరమైన అంశాల్లో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 10న చేపట్టిన ‘రైతుబంధు’ పథకం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ తెరాసకు సానుకూల పవనాలు కనిపిస్తున్నాయ. ఈ పవనాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకునేందుకు అధికారపక్షం పావులు కదపడం ప్రారంభించింది. పంచాయతీ ఎన్నికలను అధికారికంగా రాజకీయాలకు అతీతంగా నిర్వహించినప్పటికీ, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క నాయకుడు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగానే ఉంటారు. దాంతో పంచాయతీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించినా, వారు ఏ పార్టీకి చెందిన వారో స్పష్టమవుతుంది. పంచాయతీ ఎన్నికలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించినప్పటికీ, ఏ పార్టీకి ఎన్ని సర్పంచ్ స్థానాలు, ఎన్ని వార్డు సభ్యుల స్థానాలు లభించాయో ఓట్ల లెక్కింపు తర్వాత అనధికారికంగా వెల్లడవుతుంది. రైతుబంధు పథకంతో పాటు ఇతరత్రా సంక్షేమ పథకాల అమలవుతుండటంతో ప్రజల్లో అధికార పార్టీవైపు మొగ్గు అధికంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.
15 రోజుల్లోగా బీసీల రిజర్వేషన్లు
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ముఖ్యమైంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 58 శాతం సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, బీసీలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం 12736 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయం మేరకు ఎన్ని సర్పంచ్ స్థానాలు, ఎన్ని వార్డు స్థానాలు రిజర్వ్ చేయాలో నిర్ణయిస్తారు. ఎస్‌సి, ఎస్‌టిల జనాభా ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉంది. బిసిల జనాభా వివరాలు అధికారికంగా లేవు. ఇంటింటికీ సమగ్ర సర్వే సందర్భంగా కులాల వారీగా వివరాలు ఉన్నాయి. దాన్ని ఆధారం చేసుకుని బిసిల వివరాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. బిసిల వివరాలు సేకరించేందుకు 15 రోజుల గడువు ప్రభుత్వం తీసుకుంటోంది. జూన్ రెండోతేదీ వరకు ఈ వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఈ వివరాలను బట్టి ఎస్‌సి, ఎస్‌టీ, బీసీలకు ఎన్ని స్థానాలు రిజర్వ్ చేయాలో నిర్ణయిస్తారు. రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘానికి అవకాశం ఉంటుంది.