రాష్ట్రీయం

కీలక అంశాలపై చర్చిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: టీడీపీ జాతీయ మహానాడులో 18 అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం, తెలంగాణలో కుటుంబ పాలన, తదితర అంశాలపై చర్చ ఉంటుందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఆయన చాంబర్‌లో టీడీపీ మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి కాలవ ఆ వివరాలను మీడియాకు వివరించారు. విజయవాడ వేదికగా మూడు రోజుల పాటు జాతీయ మహానాడు నిర్వహిస్తామన్నారు. ఇందులో 18 అంశాలపై తీర్మానాలు చేయనున్నామన్నారు. ఏపీకి సంబంధించి 8, తెలంగాణకు సంబంధించి 5, మరో 5 సాధారణ తీర్మానాలు ఉంటాయని వెల్లడించారు. కార్యకర్తలతో ముసాయిదా తీర్మానాలపై చర్చ జరిపి ఆమోదిస్తామన్నారు. మహానాడు వేదిక నుంచి ఏన్టీఆర్‌కు ఘన నివాళి సహా పార్టీ ఆవిర్భావం, తదనంతర పరిస్థితుల గురించి చర్చ జరుపనున్నట్లు తెలిపారు. టీడీపీ ఆవిర్భావంతోనే సామాన్యుడికి ప్రభుత్వంలో భాగస్వామ్యం లభించిందని, కార్యకర్తల సంక్షేమం కోసం ఎవరూ చేయని విధంగా తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. ఇదే అంశంపై చర్చ జరుపనున్నామన్నారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో టీడీపీ పాత్ర, విభజన హామీల అమల్లో జరుగుతున్న అన్యాయం, కేంద్రం చేస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కూడా చర్చిస్తామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి
విరుద్ధంగా ప్రధాని నరేంద్రమోదీ పాలన కొనసాగుతోందని, ఈ అంశాన్ని ధైర్యంగా లేవనెత్తిన పార్టీ తమదేనని స్పష్టం చేశారు. కేంద్రం అన్యాయం చేస్తుంటే, అభివృద్ధికి ప్రతిపక్షం అడ్డుపడుతోందని ఆరోపించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు, పోలవరం నిర్మాణం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహకారం కూడా మహానాడులో చర్చిస్తామన్నారు. విద్యుత్ రంగం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతిపై, వ్యవసాయ రంగాన్ని బతికించుకునేందుకు చేస్తున్న కృషి, కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు, రాజధాని అమరావతి నిర్మాణం, ఇందుకు కేంద్రం సహాయ నిరాకరణ కూడా విస్తృతంగా చర్చిస్తామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం, సుపరిపాలన, ఫైబర్ నెట్, శాంతిభద్రతలు, బీజేపీ నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలు, వంటి కీలక అంశాలను చర్చిస్తామన్నారు. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్నా, అక్కడి ప్రభుత్వ వైఫల్యాలు, తెలంగాణలో నడుస్తున్న కుటుంబ పాలన, అమరుల త్యాగాలను విస్మరించడం, రైతు వ్యతిరేక విధానాలను చర్చిస్తామని వెల్లడించారు.